అరికెలు -
ఈ అరికెలు చిరుధాన్యాలలో ఒకటి. 2023 సంవత్సరాన్ని ఐక్య రాజ్య సమితి మిల్లెట్ ఇయర్ గా ప్రకటించింది.
ప్రకృతి మానవుడికి
ప్రసాదించిన చిరుధాన్యాలులో ఈ అరికెలు కూడా ఒకటి.
సరియైన ఆహార
నియమాల్లో శరీర పోషణకు రక్షణకు కావలసినవి
ప్రోటీన్లు, పిండిపదార్ధాలు, మాంసకృత్తులు,
కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలుతో పాటు రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్లు అవసరం.
మనం రోజు తీసుకునే
అన్నం మరియు గోధుమలతో చేసిన వంటకాలునే కాకుండా ఆయా సీజన్లలో పండే ఇతర ఆహార
పదార్ధాలను తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది మనకు తరతరాలుగా వస్తున్న
ప్రక్రియ.
మనిషి మొదట్లో
సాగుచేసిన పంటల్లో ఈ చిరుధాన్యాలే ఎక్కువ.
అయితే వీటి వాడకం
తరువాత కొంత తగ్గినప్పటికీ, వీటిలో ఉండే విలువలు తెలుసుకొని ఐక్య రాజ్య
సమితి కూడా 2023 సంవత్సరాన్ని చిరుధాన్యాల సంవత్సరంగా
ప్రకటించడం జరిగింది.
అలాంటి ఈ
అరికెలులో ఉండే ఆరోగ్య లాభాలు, పోషకాలు గురించి తెలుసుకుందాం. మరియు
వీటిని అతిగా తీసుకోవడం వలన కలిగే దుష్ప్రభావాలు గురించి కూడా తెలుసుకుందాం.
భారతదేశంలో విరివిగా వినియోగించే చిరుధాన్యాల్లో అరికెలు
కూడా ముఖ్యమైనవి.
పశ్చిమ ఆఫ్రికా దేశాలోనూ, వియత్నాం, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్, థాయ్లాండ్
వంటి ఆసియన్ దేశాల్లోనూ అరికెలను పండిస్తారు.
ఈ అరికెలను మనదేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా పిలుస్తారు.
కోడో మిల్లెట్ యొక్క వృక్షశాస్త్ర నామం - Paspalum
Scrobiculatom.
తెలుగులో - అరికెలు,
హిందీలో - కోడాన్,
తమిళంలో - వరగు,
మలయాళంలో - వరక్,
కన్నడలో - అరక,
మరాఠీ, గుజరాతీ, పంజాబీలో
- కోద్రా అని పిలుస్తారు.
అరికెలను అన్నంలా వండుకుని తినడంతో పాటు వీటితో రొట్టెలు, జావ
వంటివి కూడా తయారు చేసుకుంటారు.
పోషకాలు:
అరికెల్లో పిండి పదార్థాలు, ప్రొటీన్లు,
పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ బి1, బి2, బి3, బి5, బి6 వంటి విటమిన్లు, క్యాల్షియం,
ఐరన్, ఫాస్ఫరస్ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.
100 గ్రాములు అరికెలులో ఉండే పోషకాలు :
Calories - 353 grams.
Protein – 8.3 grams
Grams of Carbohydrates - 65 grams
Fat - 1.4 grams
Fiber - 5.2 grams
Calcium - 35 mg
Phosphorus - 188 mg
Iron - 1.7 mg
Thiamine - 15 mg
Niacin - 2 mg
ఆరోగ్య లాభాలు:
అరికెలలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి అనేక అనారోగ్య
సమస్యలు రాకుండా కాపాడుతాయి. కనుక అరికెలను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని
వైద్యులు చెబుతున్నారు.
తక్షణ శక్తినిస్తాయి. మిగిలిన చిరుధాన్యాల మాదిరిగానే
అరికెలు కూడా తక్షణ శక్తినిస్తాయి.
జీర్ణకోశాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇందులో ఉండే పీచు పదార్ధం ఫైబర్ (fiber) జీర్ణక్రియను (Digestion) మెరుగుపరిచి జీర్ణాశయాన్ని
ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాకుండా మలబద్ధకం వంటి సమస్యలను కూడా తగ్గిస్తాయి.
నెమ్మదిగా జీర్ణం కావడంతో త్వరగా ఆకలి కానివ్వవు.
క్యాన్సర్ ను తగ్గిస్తాయి: అరికెలలో
యాంటీఆక్సిడెంట్స్ (Antioxidants) పుష్కలంగా ఉంటాయి. ఇవి
శరీరంలోని క్యాన్సర్ కణాల వ్యాప్తిని అరికట్టి క్యాన్సర్ విరుగుడుగా పనిచేసి
తద్వారా క్యాన్సర్ (Cancer) వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అరికెలను ఆహారంగా
తీసుకుంటే జీవితకాలం పెరుగుతుంది.
ఉదర సమస్యలను తగ్గిస్తాయి: వీటిని తీసుకుంటే
కడుపులో నొప్పి, వాంతులు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ (Gastric
problem) వంటి ఇతర ఉదర సమస్యలకు (Abdominal problems) దూరంగా ఉండవచ్చు. అరికెలలో ఉండే
పోషకాలు ఉదర భాగాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
నెలసరి సమస్యలు: మహిళలుకు నెలసరి సమయంలో అధిక
రక్తస్రావం (Bleeding) కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాంటి
సమయాల్లో మహిళలు ఈ అరికెలను ఆహారంగా తీసుకుంటే నెలసరి సమస్యలు (Menstrual
problems) తగ్గుతాయని వైద్యులు చెబుతున్నారు.
రక్తహీనతను నివారిస్తాయి. అరికెలను క్రమం తప్పకుండ
తీసుకుంటే ఎర్ర రక్త కణాల సంఖ్య తో పాటు శరీరంలో అనవసరముగా పేరుకు పోయిన
కొవ్వును తగ్గించడంలో దోహదం చేస్తుంది.
బరువు తగ్గడానికి: అరికెలలో కొవ్వు
పదార్ధాలు తక్కువగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మనల్ని ఎక్కువసేపు కడుపు
నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది దానివల్ల ఎక్కువుగా ఆకలి వేయదు. కడుపు నిండుగా ఉన్న
భావం కలుగుతుంది. బరువు తగ్గాలనుకునే వారు రోజువారీ ఆహారంలో అరికెల చేర్చుకుంటే
అధిక బరువును నియంత్రించవచ్చు.
మధుమేహం: మధుమేహ వ్యాధిగ్రస్తులకు
మంచిది. అరికెలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన రక్తంలో చక్కెర స్థాయిలను
పెంచదు. కాబట్టి డయాబెటిక్ రోగులకు ఇది చాలా మంచి ఆహారం.
గ్లూటెన్ ఫ్రీ:
అరికెల లో షుగర్ వ్యాధిని కలిగించే గ్లూటెన్ లేదు. గ్లూటెన్
లేకపోవడం వల్ల మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఉత్తమముగా పని చేస్తుంది .
విష జ్వరాలు : డెంగ్యూ, టైఫాయిడ్
వంటి విష జ్వరాలు (Toxic fevers) వచ్చినప్పుడు అరికెలను
తీసుకుంటే రక్త శుద్ధి (Purifying the blood) జరిగి త్వరగా
కోలుకునేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా అనేక ఇతర అనారోగ్య సమస్యలను తగ్గించడానికి
కూడా అరికెలు సహాయపడతాయి.
గుండెజబ్బుల ముప్పును తగ్గిస్తాయి.
ఎముకలు బలాన్ని: అరికెలను
తీసుకోవడం వల్ల ఎముకలు, కండరాలు, నరాలుకు
బలాన్ని చేకూరుస్తాయి. మరియు నీరసం, అలసట సమస్యలు దూరం అమవుతాయి.
కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వంటి సమస్యలను
తగ్గిస్తుంది. శరీరానికి కావలసినంత శక్తి లభిస్తుంది.
నిద్ర లేమి సమస్యలతో బాధపడేవారికి అరికెలు తీసుకోవడం
వలన మంచి నిద్ర పడుతుంది.
దుష్ప్రభావాలు :
వీటిలో పీచు, విటమిన్లు, ఖనిజాలు,
ఆక్సిడెంట్లు, మరియు ఇతర పోషకాలు ఎక్కువగా
ఉంటాయి. అయినప్పటికీ, కొన్ని సాధారణ దుష్ప్రభావాలు ఉంటాయి.
ఇవి:
1.
దాహం
మరియు పొడి: ఫైబర్ ఎక్కువగా
ఉండటం వల్ల ఎక్కువగా నీరు తాగడానికి దాహం కలుగుతుంది.
2.
అజీర్ణం
మరియు గ్యాస్: ఇందులోని అధిక
ఫైబర్ కారణంగా, కొంతమందికి
అజీర్ణం, గ్యాస్ లేదా bloating అనుభవం
కలగవచ్చు.
ఈ అరికెలు వాడకం ప్రారంభించేటప్పుడు, కొంత కాలం పాటు పరిమిత పరిమాణంలో వాడి,
మీ శరీరంలో వచ్చే మార్పులను గమనించడం మంచిది. మీకు ఏవైనా పై సమస్యలు
అనిపిస్తే, వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
గమనిక:- ఇందులో ఉన్న
సమాచారం మీకు ఒక అవగాహన మరియు సమాచార నిమిత్తం తెలియపరుస్తున్నాము. ఆరోగ్య
నిపుణులు,
అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం.
మీరు ఇందులోని అంశాలను పాటించేముందు మీ వయసురీత్యా, మీ
శరీరతత్వానికి మీకున్న ఇతర అనారోగ్య కారణాలు దృష్ట్యా సరైన వైద్య నిపుణులును
సందర్శించి మీరు దాని విధి విధానాలను తెలుసుకొని పాటించవలెను.
ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను
సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.