Breaking

వారంలో ఏడు రోజులు - దేవి దేవతల పూజా విధానాల ప్రాముఖ్యత

విషయ సూచిక - ముఖ్య విషయాలు


హిందూ సంప్రదాయంలో, వారంలోని ప్రతి రోజుకు ఆయా దేవతలను పూజించడం వల్ల మానసిక ప్రశాంతత, ఆరోగ్యం, ఆయురారోగ్యాలు లభిస్తాయని, సకల సౌభాగ్యాలు శుభ ఫలితాలు కలుగుతాయి. 


ఆదివారం – (సూర్యుడు)

సూర్య దేవుని ఆరాధన

విధానం: ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయాలి. రాగి పాత్రతో సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి. ఎరుపు రంగు పూలు వాడాలి. ఎర్ర చందనం మరియు నీటితో పూజించడం. ఉపవాసం పాటించడం ఎంతో శ్రేయస్కరం.

ప్రాముఖ్యత: ఆరోగ్యం, కంటి లేదా చర్మ సంబంధిత వ్యాధుల నుండి ఉపశమనం, కీర్తి ప్రతిష్టలు. 'సూర్యాష్టకం' లేదా 'ఆదిత్య హృదయం' పఠించడం

 

సోమవారం – (శివుడు, పార్వతి)

విధానం: "ఓం నమః శివాయ" మంత్ర జపం, బిల్వ పత్రాలు, పాలు మరియు తెల్లని పూలతో పూజ, చంద్ర దోష నివారణ, శివలింగానికి జలాభిషేకం, మారేడు దళాలతో పూజ చేయాలి. పంచామృతాలతో అభిషేకం. ఉపవాసం ఉండటం మంచిది.

ప్రాముఖ్యత: మనశ్శాంతి; కోరికలు నెరవేరుతాయి.

 

మంగళవారం – అమ్మవారు (దుర్గా దేవి, కాళికా దేవి) ఆంజనేయ స్వామి (హనుమంతుడు) లేదా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన

విధానం: 'ఆంజనేయ స్తోత్రం' లేదా 'సుబ్రహ్మణ్యాష్టకం' పఠించడం,  హనుమంతునికి సింధూరంతో పూజ చేయాలి. సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేయాలి. ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి.

ప్రాముఖ్యత: శత్రువులపై విజయం; ధైర్యం, కుజ దోష నివారణ, రుణబాధలు తొలగుతాయి. ఎర్రని పూలు మరియు రాగి పాత్రల వినియోగం

 

బుధవారం – గణపతి, మహావిష్ణువు ఆరాధన

విధానం: వినాయకునికి గరికతో పూజ చేయాలి. పెసలు దానం ఇవ్వాలి. ఆకుపచ్చ రంగు ఆహారం మరియు వస్త్రధారణ ఉప్పు లేని ఆహారం తీసుకోవడం ఆవులకు పచ్చ గడ్డిని తినిపించడం

ప్రాముఖ్యత: విద్య, వ్యాపారం మరియు వృత్తిలో విజయం.

 

గురువారం – గురు దేవుడు (దత్తాత్రేయుడు/దక్షిణామూర్తి) లేదా విష్ణువు, సాయిబాబా ఆరాధన

ప్రాముఖ్యత: జ్ఞానం; ఆధ్యాత్మిక ఎదుగుదల, వివాహ ప్రాప్తి కలుగుతాయి.

పసుపు రంగు వస్త్రాలు ధరించి పూజించడం, అరటిపండ్లు, మామిడి పండ్ల వంటివి సమర్పించడం, ఉప్పు లేకుండా ఉపవాసం ఉండటం

 

శుక్రవారం – లక్ష్మీదేవి లేదా దుర్గాదేవి - సంతోషిమాతని పూజించడం

విధానం: అమ్మవారికి కుంకుమ పూజ, దీపారాధన చేయాలి. తెల్లని పువ్వులు మరియు క్షీరదం (పాలతో చేసిన తీపి అన్నం) సమర్పించడం.

ప్రాముఖ్యత: సంపద మరియు కుటుంబ సుఖం

లక్ష్మీ అష్టోత్తరం మరియు లలితా సహస్రనామం పఠించడం.

 

శనివారం – వెంకటేశ్వర స్వామి లేదా శని దేవుడిని పూజించడం

విధానం: నవగ్రహ ఆలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, నల్లని వస్తువులు దానం, విష్ణు సహస్రనామం పాటించాలి. నలుపు లేదా నీలి రంగు పువ్వులతో పూజించడం

ప్రాముఖ్యత: శని, రాహు, మరియు కేతు దోషాలకు పరిహారం ప్రత్యేకమైన రోజుల్లో ఉపవాసం పాటించడం మంచిది.

 

ముఖ్య గమనిక:

ఏ వ్రతమైనా లేదా కర్మకాండ అయినా కేవలం ఫలితాల కోసం కాకుండా, భక్తిశ్రద్ధలతో చేయాలి. ఆడంబరాన్ని లేదా దుబారాను నివారించండి. ఆహారంలో మితంగా ఉండండి మరియు ప్రవర్తనలో పవిత్రతను పాటించండి.

  

🙏 శ్రీహన్ష్ – భక్తి విభాగాలు

స్తోత్రాలు • మంత్రాలు • పూజలు • వ్రతాలు • క్షేత్రాలు • పురాణాలు