గణేశ
షోడశ నామావళి
గణేశ షోడశనామ స్తోత్రం
సుముఖశ్చైకదంతశ్చ
కపిలో గజకర్ణకః |
లంబోదరశ్చ
వికటో విఘ్నరాజో గణాధిపః || 1 ||
ఓం సుముఖాయ
నమః - సుందరమైన ముఖం కలవాడు
ఓం ఏకదంతాయ
నమః - ఒక దంతం మాత్రమే ఉన్నవాడు
ఓం కపిలాయ
నమః - గోధుమ/ఎరుపు వర్ణం కలవాడు
ఓం గజకర్ణకాయ
నమః - ఏనుగు చెవులు కలవాడు
ఓం లంబోదరాయ
నమః - విశాలమైన పొట్ట కలవాడు
ఓం వికటాయ
నమః - విస్తుతమైన, మహారూపం కలవాడు
ఓం విఘ్నరాజాయ
నమః - అడ్డంకులు అధిపతి
ఓం గణాధిపాయ
నమః - నాయకుడు, మార్గదర్శకుడు
ధూమ్రకేతు-ర్గణాధ్యక్షో
ఫాలచంద్రో గజాననః |
వక్రతుండ-శ్శూర్పకర్ణో
హేరంబ-స్స్కందపూర్వజః || 2 ||
ఓం ధూమ్రకేతవే
నమః - ధూమ్ర వర్ణ ధ్వజం కలవాడు
ఓం గణాధ్యక్షాయ
నమః - గణాలకు అధిపతి
ఓం ఫాలచంద్రాయ
నమః - నుదిటిపై చంద్రుడు ఉన్నవాడు
ఓం గజాననాయ
నమః - ఏనుగు ముఖం కలవాడు
ఓం వక్రతుండాయ
నమః - వంకర తుండు కలవాడు
ఓం శూర్పకర్ణాయ
నమః - పెద్ద ఆకారపు చెవులు కలవాడు
ఓం హేరంబాయ
నమః - భక్తులను రక్షించేవాడు
ఓం స్కందపూర్వజాయ
నమః - స్కందుడు (సుబ్రహ్మణ్యుడు) కన్నా పెద్దవాడు.
షోడశైతాని
నామాని యః పఠేచ్ఛృణుయాదపి |
విద్యారంభే
వివాహే చ ప్రవేశే నిర్గమే తథా |
సంగ్రామే
సర్వ కార్యేషు విఘ్నస్తస్య న జాయతే || 3 ||