ప్రపంచంలో మొత్తం జనాభాలో వరి తరువాత ఎక్కువగా వాడబడుతున్న
ఆహారధాన్యం గోధుమ మాత్రమే.
ఇది ప్రపంచ ఆహార కొరత తీర్చడం లో రెండవ స్థానం లో ఉందని
చెప్పుకోవచ్చు.
ముఖ్యంగా ప్రపంచంలో చాలా
ప్రాంతాల్లో గోధుమలే ప్రధాన ఆహారం. గోధుమలను ప్రపంచవ్యాప్తంగా చాలా
రకరకాలుగా వాడతారు.
మన భారతదేశంలో కూడా వీటిని వాడే వారి సంఖ్య ఎక్కువే. భారతదేశంలో
ఎక్కువగా పండించే ధాన్యాలలో ఈ గోధుమ ఒకటి.
మన ఉత్తరాదిలో బియ్యం కంటే గోధుమలు మరియు వాటితో చేసే పదార్ధాలను ఎక్కువగా వాడతారు.
గోధుమలో ఉండే పోషకాలు:
గోధుమల్లో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, విటమిన్ బి1, బి2, బి3, బి5, బి6, బి9, విటమిన్ ఇ, విటమిన్ కె వంటి విటమిన్లు, క్యాల్షియం, పొటాషియం, ఐరన్, మాంగనీస్, సోడియం, మెగ్నీషియం, సెలీనియం, ఫైబర్, ఫాస్ఫరస్, జింక్ వంటి ముఖ్యమైన ఖనిజ లవణాలు ఉన్నాయి.
ఆరోగ్య లాభాలు:
గోధుమలు మంచి శక్తినిస్తాయి.
పిండి పదార్థాలు మరియు పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి.
గోధుమలు మీ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి.
ఇవి రక్తాన్ని శుధ్ది చేస్తుంది. మీరు రోజు గోధుమలను తీసుకోవడం వలన మీ రక్తాన్ని శుద్ధి
చేస్తుంది.
గోధుమల్లో ఫోలిక్ ఆసిడ్, ఐరన్, విటమిన్ బి12, పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఎర్ర రక్త కణాలు పెరుగుదలకు దోహదం చేస్తాయి.
ఇది బ్లడ్ ప్రెషర్ ను తగ్గిస్తుంది.
గోధుమల్లో విటమిన్ ఇ , సెలీనియం, ఫైబర్ ఉన్నందున
కాన్సర్ ను నివారిస్తుంది. ఇవి కాన్సర్ నివారణకు కారకాలు.
బరువు తగ్గాలని అనుకునేవారు ఈ గోధుమలతో చేసే వంటకాలను తినడం
మంచిది. బరువుని తగ్గిస్తుంది. గోధుమలను రోజువారీ ఆహారంలో అన్నంకి బదులుగా
తీసుకోవడం వలన మీ బరువుని తగ్గిస్తుంది.
ఇందులో మెగ్నీషియం పుష్కలంగా ఉండటం వల్ల టైప్-2 డయాబెటిస్ ను అదుపు చేస్తాయి.
గోధుమలో షుగర్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. వరితో పోలిస్తే
గోధుమలో షుగర్ లెవెల్స్ తక్కువ. కాబట్టి షుగర్ ఉన్నవారు ఈ గోధుమలు తో చేసే చపాతీ
లేక రొట్టెలను తీసుకోవడం ద్వారా షుగర్ ను కంట్రోల్ చేస్తుంది.
కిడ్నీ లో రాళ్ళూ ఉన్నవారు ఇంకా కిడ్నీ సమస్యలు ఉన్నవారు
రోజువారీ డైట్లో ఇది తీసుకోవడం ద్వారా కిడ్నీలో రాళ్లను కరిగిస్తుంది.
గుండె జబ్బులు మరియు చిన్నపిల్లల్లో వచ్చే ఉబ్బసాన్ని
నివారిస్తాయి.
గుండె జబ్బులు ఉన్నవారు దీన్ని తీసుకోవడం వలన గుండెకు
బలాన్ని చేకూరుస్తుంది.
రుమాటిక్ నొప్పులను మరియు పిత్తాశయంలో రాళ్లు ఏర్పడటాన్ని
నివారిస్తాయి.
మలబద్దకంతో బాధపడే వారు ఈ గోధుమలతో చేసే వంటకాలను తీసుకోవడం
మంచిది. మలబద్దకాన్ని నివారిస్తుంది.
100 గ్రాముల గోధుమలో సాధారణంగా ఉండే పోషక విలువలు, విటమిన్లు
మరియు ఖనిజాలు ఈ క్రింది విధంగా ఉంటాయి:
పోషక విలువలు:
- కేలొరీలు: 340–350 కేలొరీలు
- ప్రోటీన్: 12–13 గ్రాములు
- కొవ్వు: 1.5–2 గ్రాములు
- కార్బోహైడ్రేట్స్: 70–75 గ్రాములు
- డైట్ ఫైబర్: 12–15 గ్రాములు
- షుగర్: 0–1 గ్రాము
విటమిన్లు:
- విటమిన్ B1 (థయామిన్): 0.4–0.5 మిల్లిగ్రాములు
- విటమిన్ B2 (రైబోఫ్లావిన్): 0.1 మిల్లిగ్రాములు
- విటమిన్ B3 (నియాసిన్): 5–6 మిల్లిగ్రాములు
- విటమిన్ B5 (పాంటోతెనిక్
ఆమ్లం): 0.5–0.8 మిల్లిగ్రాములు
- విటమిన్ B6 (పిరిడాక్సిన్): 0.1–0.2 మిల్లిగ్రాములు
- ఫోలేట్: 30–40 మైక్రోగ్రాములు
ఖనిజాలు:
- ఇరన్: 3–4 మిల్లిగ్రాములు
- మ్యాగ్నీషియం: 120–150 మిల్లిగ్రాములు
- ఫాస్ఫరస్: 300–350 మిల్లిగ్రాములు
- పోటాషియం: 300–400 మిల్లిగ్రాములు
- జింక్: 2–3 మిల్లిగ్రాములు
దుష్ప్రభావాలు:
గ్లూటెన్ అనే ప్రొటీన్ గోధుమల్లో ఉంది. దీనివల్ల కొందరిలో
జీర్ణకోశ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి.
అందుకోసం ఈ సమస్యను గుర్తించి శాస్త్రవేత్తలు గ్లూటెన్ లేని
గోధుమ రకాలను అభివృద్ధి చేశారు. ఇవి ఇప్పుడు బాగానే అందుబాటులోకి వచ్చాయి. వీటిని
నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.
గోధుమలను అధికంగా తీసుకోవడం వలన మీ శరీరానికి వేడి
చేస్తుంది. అందుకోసం ఇది తీసుకున్న తరువాత చలువ చేసే పదార్ధాలు తీసుకుంటే మంచిది.