ప్రపంచవ్యాప్తంగా చాలా ఎక్కువుగా వాడే ధాన్యాలలో వరి
ప్రధానమైనది.
మన భారతీయులు ఎక్కువుగా వరి నుంచి వచ్చే బియ్యాన్ని అన్నం ఇంకా ఇతర రూపంలో ఒండుకొని తింటారు.
బియ్యంలోని రకాలు, వండే పద్ధతులను బట్టి పోషకాల్లో కొద్దిగా మార్పులు ఉండే అవకాశాలు ఉన్నా కానీ
తక్షణ శక్తిని ఇచ్చే ఆహారంలో బియ్యం తిరుగులేనిది. పిండి పదార్థాలు పుష్కలంగా ఉండే
బియ్యం ఏ రూపంలో వినియోగించినా, తక్షణ శక్తి ఇస్తుంది.
భారతదేశంలో1970 వరకు దాదాపు 1,10,000 రకాల బియ్యం
ధాన్యాలు ఉండేవి. కాలక్రమేణా ఇప్పుడు దానిలో దాదాపు 6,000 రకాలు మాత్రమే ఉన్నాయి. ముక్యంగా ఇప్పుడు ఎక్కువ
అందుబాటులో ఉన్నవి Brown Rice, Black Rice, Red Rice, Basmati Rice, Purple
Rice, Wild Rice, Enriched White Rice, Arborio Rice.
ప్రస్తుత కాలంలో వైట్ రైస్ కంటే బ్రౌన్ మరియు రెడ్ రైస్
ఆరోగ్యకరమైన ఎంపిక. బియ్యంలో గల ఎరుపు రంగు ఆంథోసైనిన్స్ అనే యాంటీఆక్సిడెంట్
నుండి వస్తుంది.
అన్నిటికంటే ముక్యంగా పాలిష్ చేయని దంపుడు బియ్యం వాడటం
చాలా ఆరోగ్యకరం. పాలిష్ చేయని బియ్యం రకానికి దూరంగా ఉండడం చాలా మంచిది. ఆధునిక
వైద్య నిపుణులు కూడా ఇదే చెబుతు సూచిస్తున్నారు. ఎందుకంటే పాలిష్ చేయని బియ్యంలో
పీచుపదార్థం అధికంగా ఉండి మలబద్ధకాన్ని నివారిస్తుంది.
అయితే ఇప్పుడు మనం సాధారణ వైట్ రైస్ గురించి చర్చిద్దాం.
పోషకాలు:
బియ్యంలో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, విటమిన్ బి1, బి2, బి3, బి5, బి6, విటమిన్ ఇ వంటి
విటమిన్లు, ఐరన్, క్యాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, వంటి ఖనిజ
లవణాలు ఉంటాయి.
ఆరోగ్య లాభాలు గురించి తెలుసుకుందాం:
బియ్యంతో చేసే ఆహార పదార్ధాలు తక్షణమే శక్తినిస్తుంది.
అందులో ఎక్కువ మొత్తంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇది ముఖ్యంగా శ్రమ చేసే వారికి
ఆహారంలో అవసరం. బియ్యంలో కొలెస్ట్రాల్ లేనందున ఒంట్లో అనవసరమైన కొవ్వులు పేరుకోవు.
ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. సోడియం తక్కువగా ఉండటం
వల్ల ఇది రక్తపోటును నియంత్రిస్తుంది.
జీర్ణకోశ సమస్యలను అధిగమిస్తుంది. అన్నం జీర్ణక్రియను
సులభతరం చేస్తుంది. ఇది గ్యాస్, పేగు సమస్యలు ఉన్నవారికి మంచిది. బియ్యంతో చేసే ఆహరం సులభంగా జీర్ణం అవుతుంది.
అన్నంలో విటమిన్ B గ్రూప్ (తియామిన్, నయాసిన్) మరియు
కొన్ని మినరల్స్ (మ్యాగ్నీషియం, మాంగనీస్) ఉంటాయి. ఇవి శరీరానికి ముఖ్యమైనవి. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
అన్నంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యం కాపాడటంలో మరియు వృద్ధాప్య
లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి.
ముఖ్యంగా వేడి వాతావరణంలో అన్నం తినడం శరీరానికి
చల్లదనాన్ని అందిస్తుంది.
శరీరానికి మంచి శక్తినిచ్చేది పిండిపదార్థాలే. మెదడు, కండరాలు మరియు కణాల ఆరోగ్యం బాగుండాలంటే అది పిండిపదార్థాల వల్ల మాత్రమే
సాధ్యం. అలంటి పిండి పదార్ధాలు ఈ బియ్యం లో పుష్కలంగా ఉంటాయి.
ప్రాసెసింగ్ చేయని ఎర్ర బియ్యం లేదా బ్రౌన్ రైస్ తీసుకుంటే
అందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.
అన్నంలో ప్రధానంగా నీటి శాతం ఎక్కువగా ఉంటుంది, ఇది శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో సహాయపడుతుంది.
గుండె సంబంధిత సమస్యలు, అధిక రక్తపోటు మరియు డయాబెటీస్ ఉన్నవారు తక్కువగా ప్రాసెస్
చేసిన రైస్ (బ్రౌన్ రైస్) తినడం వలన
ఆరోగ్యంగా ఉండవచ్చు.
బియ్యంతో చేసే అన్నం ఎక్కువగా తింటే లావు అవుతారని చాలా
మంది అనుకుంటారు. అన్నం పాక్షికంగా తీసుకుంటే బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.
అంతే కాకుండా, ఎక్కువ మోతాదులో
తీసుకుంటే బరువు పెరగడం కూడా సహజమే.
కానీ, బరువు పెరిగేది కార్బోహైడ్రేట్ల వల్ల కాదు. శరీరంలో అదనంగా పేరుకుపోయే
క్యాలరీల వల్ల. వాటిని ఎప్పటికప్పుడు వ్యాయామం చేసి కరిగించుకోవాలి.
ఎందుకంటే ప్రపంచం మొత్తం మీద మానవాళికి ఆహార కొరత తీర్చడంలో
మొదటి స్థానంలో బియ్యం తో చేసే అన్నం మాత్రమే. ఇదే ఇప్పటి వరకు మొదటి స్థానంలో
ఉంది. అలా అనుకుంటే ప్రపంచంలో ఉన్న వాళ్లలో చాలా మంది లావుగానే ఉంటారు.
మన భారతదేశ సాంప్రదాయం ప్రకారం చిన్నపిల్లలకు మొదట అన్న
ప్రాసన్న పేరుతో బియ్యంతో చేసే పరవాన్నం పెడతారు.
అన్నంలో గంజి శాతం ఎక్కువ. అది ఒక పొరలాగా పనిచేసి
పెద్దప్రేగుకు క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది.
ఇది గ్లూటెన్ రహిత సమ్మేళనం. అంటే గ్లూటెన్ పదార్ధం లేనిది.
ఈ గ్లూటెన్ జీర్ణ వ్యవస్థ పై ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి ఈ బియ్యంతో చేసే ఆహార
పదార్ధాలు మరియు అన్నం నిరభ్యన్తరంగా తీసుకోవచ్చు.
గోధుమ ఆధారిత ధాన్యాలు మరియు ఇతర గ్లూటెన్ పదార్ధాలకు ఈ
బియ్యం గొప్ప ప్రత్యామ్నాయంగా చెబుతారు.
దుష్ప్రభావాలు :
వైట్ రైస్ తినడం చాలా వరకు మంచిదే అయినప్పటికీ ఎక్కువ
మెుత్తంలో అస్సలు తీసుకోకూడదు.
రోజూ మితంగానే రైస్ తినాలని నిపుణులు సూచిస్తున్నారు.
తెల్ల అన్నం (పోలిష్డ్ రైస్) తినడం వల్ల ఇందులో
కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండటం వల్ల, అధిక మోతాదులో తింటే బరువు పెరగడానికి కారణం అవుతుంది. ఫైబర్ తక్కువగా ఉండడం
వల్ల శరీరానికి దీర్ఘకాలం పొట్ట నిండిన ఫీలింగ్ ఇవ్వదు, అందువల్ల మరింత తినే అవకాశం ఉంటుంది.
తెల్ల అన్నం ప్రతీరోజు తింటే గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఎక్కువగా ఉంటుంది, దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలుటైప్ 2 డయబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఎందుకంటే ఇందులో షుగర్ లెవెల్స్
ఎక్కువుగా ఉంటాయి కాబ్బట్టి అందుకే తక్కువ మెుత్తంలో తీసుకోవాలి.
ప్రాసెసింగ్ చేసిన అన్నం తినడం వల్ల ఫైబర్ లోపించి ఉంటుంది.
ఇది మలబద్ధకం మరియు జీర్ణక్రియ సమస్యలకు కారణమవుతుంది.