Barley Health Benefits | Nutritional Facts in Barley | బార్లీ ఆరోగ్య ప్రయోజనాలు | బార్లీలో పోషకాహార వాస్తవాలు | దుష్ప్రభావాలు

బార్లీ - Barley

బార్లీ అనేది పోషక విలువలతో నిండిన ధాన్యం. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

పశ్చిమాసియా, ఈశాన్య ఆఫ్రికా, సింధులోయ ప్రాంతంలో పురాతన కాలం నుంచి వాడుకలో ఉన్న తృణధాన్యం బార్లీ.

బార్లీ గింజలను పిండిగా చేసుకుని రొట్టెలు, బ్రెడ్, కేకులు, బిస్కట్లు తయారు చేసుకుని వాడుతుంటారు.

బార్లీ గంజితో పానీయాలను తయారు చేసుకుని ఇప్పటికీ వాడుతుంటారు.

హెల్త్ డ్రింక్ పౌడర్లలో పోషకాలు పుష్కలంగా గల బార్లీని విరివిగా ఉపయోగిస్తారు. అయితే, మన దేశంలో మిగిలిన తృణధాన్యాలతో పోలిస్తే బార్లీ వినియోగం కాస్త తక్కువే.

 

పోషకాలు:

బార్లీలో పిండి పదార్థాలు, పీచు పదార్థాలు, ప్రొటీన్లు, విటమిన్-ఎ, విటమిన్-బి1, బి2, బి3, బి5, బి6, బి9, విటమిన్-సి, విటమిన్-కె వంటి విటమిన్లు, ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.

 

బార్లీ లో ప్రధానమైన విటమిన్లు మరియు వాటి ఆరోగ్య లాభాలు:

విటమిన్ B1 (థయామిన్): కార్బోహైడ్రేట్ శోషణకు సహాయపడుతుంది, నరాల (నర్వ్) పనితీరును మెరుగుపరుస్తుంది.

విటమిన్ B2 (రిబోఫ్లావిన్): శక్తి ఉత్పత్తికి మరియు కొవ్వులు, ఔషధాలు మరియు స్టెరాయిడ్ల యొక్క మెటబాలిజానికి ఇది ముఖ్యమైనది.

విటమిన్ B3 (నయాసిన్): DNA మరమ్మత్తుకు, శక్తి ఉత్పత్తికి, మరియు కొవ్వులు మరియు కార్బోహైడ్రేట్ల మెటబాలిజానికి అవసరమైనది.

విటమిన్ B5 (పాంటోథెనిక్ ఆమ్లం): కొవ్వు ఆమ్లాల మెటబాలిజానికి ముఖ్యమైన కోఎంజైమ్ A తయారీలో భాగస్వామ్యం.

విటమిన్ B6 (పిరిడోక్సిన్): ప్రోటీన్ మెటబాలిజం, ఎర్ర రక్తకణాల ఉత్పత్తి, మరియు న్యూరోట్రాన్స్‌మిటర్ల సృష్టిలో భాగం.

ఫోలేట్ (విటమిన్ B9): DNA సింథసిస్ మరియు మరమ్మత్తు కోసం అవసరమైనది, గర్భధారణ సమయంలో ముఖ్యమైనది.

విటమిన్ E: అద్భుతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది, ఫ్రీ రాడికల్స్ నుండి కణాలను రక్షిస్తుంది.

 

ఇతర ఆరోగ్య ప్రయోజనాలు:

బార్లీలో ప్రోటీన్లు, కార్పోహైడ్రేడ్లు, కొవ్వు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి.

జీర్ణక్రియ: బార్లీ లోని అధిక మోతాదులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు మలబద్ధకం తగ్గిస్తుంది.

హృదయ ఆరోగ్యం: బార్లీ లోని విటమిన్ B మరియు విటమిన్ E, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. గుండెజబ్బుల ముప్పును గణనీయంగా తగ్గిస్తుంది.

రక్త చాపం: బార్లీ లోని విటమిన్లు మరియు ఖనిజాలు, రక్త చాపం మెరుగుపరచడంలో మరియు అనీమియా నివారణలో సహాయపడతాయి.

యాంటీఆక్సిడెంట్ రక్షణ: విటమిన్ E వంటి యాంటీఆక్సిడెంట్లు, కణాలను నాశనం చేసే ఫ్రీరాడికల్స్ నుండి రక్షించడంలో సహాయపడతాయి.

మెటబాలిజం: బార్లీలోని విటమిన్ B కాంప్లెక్స్, శక్తి ఉత్పత్తి మరియు వివిధ జీవక్రియ చర్యలకు సహాయపడతాయి.

జీర్ణావయవాల పనితీరు మందగించటం: ఒక పావు కప్పు బార్లీ గింజలను రెండున్నర లీటర్ల నీళ్లకు కలిపి, అందులో సగం నీళ్లు మాత్రమే మిగిలేంతవరకూ మరిగించి తాగాలి. రెండు లేదా మూడు రోజులపాటు చేస్తే పేగులు మరియు జీర్ణవ్యవస్థ యొక్క పనితీరు మెరుగవుతుంది. జీర్ణాశయాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.

బార్లీ రక్తపోటును నివారిస్తుంది. బార్లీలో సోడియం తక్కువ కనుక రక్తపోటు భయం ఉండదు.

రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది.

జ్వరం, ఒంటినొప్పులు, వాపు ఉన్నవారికి బార్లీని ఆహార ఔషదంగా వాడవచ్చు. చిన్న పిల్లలకు బార్లీని పాలతోగాని లేదా పండ్ల రసంతో గాని కలిపి ఇవ్వవచ్చు. జ్వరంతో నీరసం ఉంటే బార్లీ కషాయయంలో గ్లూకోజ్ కలిపి తీసుకుంటే వెంటనే శక్తి వస్తుంది.

కొలెస్ట్రాల్ పెరగనివ్వదు. మన పేగుల్లో నివసించే బ్యాక్టీరియా బార్లీలోని బీటాగ్లూకాన్స్‌ను వినియోగించుకొని ఫ్యాటీయాసిడ్స్‌గా మారి కాలేయంలో కొలెస్ట్రాల్ తయారవ్వకుండా చేస్తాయి.

బార్లీలో ఉండే టోకోట్రయినాల్ అనే పదార్థం కూడా కొలెస్ట్రాల్ తయారీని అడ్డుకుంటుంది.

ఎదుగుతున్న పిల్లలకు ఇచ్చే సూప్‌లలో, పాలలో బార్లీ వాడటం ద్వారా వారి ఎదుగుదలకి, ఆరోగ్యానికి, శక్తికి దోహదం చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

బార్లీ గింజలతో గంజిని తయారుచేసి అందులో, మజ్జిగ, నిమ్మరసాన్ని కలిపి తీసుకుంటే మూత్ర సంబంధ వ్యాధులతో బాధపడే వారికీ  అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. మూత్రం జారీ అవటంవల్ల శరీరంలో వాపు దిగుతుంది. ఇది నెఫ్రైటిస్, సిస్టైటిస్ వంటి సమస్యల్లో సైతం ఉపయుక్తంగా ఉంటుంది.

మూత్ర విసర్జన కష్టంగా ఉన్నవారు బార్లీ కషాయానికి కొద్దిగ బెల్లం, నిమ్మరసం కలిపి తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.

బార్లీని నీళ్ళలో నానబెట్టి రోజూ తాగితే శరీరానికి పట్టిన నీరు తగ్గుతుంది.

ఒంటికి నీరు చేరిన గర్భిణి స్త్రీలు బార్లీ నీటిని తాగడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

పిల్లలకు పాలిచ్చే బాలింతల్లో తల్లిపాలు తక్కువగా పడితే బార్లీని పాలతో కలిపి తీసుకుంటే పలు ఎక్కువుగా ఉంటుంది.

అనారోగ్యంతో బాధపడేవారు ప్రతీరోజూ బార్లీ గంజిని తాగితే నీరసం, బలహీనత తగ్గి శక్తి లభిస్తుంది.

 

100 గ్రాముల బార్లీ లో ఉండే పోషక విలువలు

Calories: 354 kcal

Water: 10.1 g

Protein: 12.5 g

Total Fat: 2.3 g

Saturated Fat: 0.5 g

Monounsaturated Fat: 0.3 g

Polyunsaturated Fat: 1.1 g

Carbohydrates: 73.5 g

Sugars: 0.8 g

Dietary Fiber: 17.3 g

Vitamins

Vitamin B1 (Thiamine): 0.191 mg (16% DV)

Vitamin B2 (Riboflavin): 0.114 mg (9% DV)

Vitamin B3 (Niacin): 4.604 mg (29% DV)

Vitamin B5 (Pantothenic Acid): 0.282 mg (6% DV)

Vitamin B6 (Pyridoxine): 0.26 mg (20% DV)

Folate (Vitamin B9): 23 µg (6% DV)

Vitamin E: 0.02 mg (0% DV)

Vitamin K: 2.2 µg (2% DV)

Minerals

Calcium: 33 mg (3% DV)

Iron: 3.6 mg (20% DV)

Magnesium: 133 mg (33% DV)

Phosphorus: 264 mg (38% DV)

Potassium: 452 mg (13% DV)

Sodium: 12 mg (1% DV)

Zinc: 2.77 mg (25% DV)

Copper: 0.37 mg (41% DV)

Manganese: 1.943 mg (84% DV)

Selenium: 37.7 mg (68% DV)

 

దుష్ప్రభావాలు:

బార్లీ చాలా ఆరోగ్యకరమైన ఆహారం. అయితే, కొన్ని సందర్భాల్లో, బార్లీ తీసుకోవడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. వారు బార్లీకి సెన్సిటివ్ అయినప్పుడు లేదా ఎక్కువ పరిమాణంలో తీసుకున్నప్పుడు కనిపించవచ్చు. అవి ఇప్పుడు మనం చూద్దాం.

అలెర్జీ సమస్యలు :

కొంత మంది బార్లీ తీసుకుంటే అలెర్జికి గురవుతారు. ఈ అలెర్జీ చర్మ సమస్యలు, ఊపిరి ఆడకపోవడం. ఇవి చిన్నతనం నుండి తీవ్రమైనవిగా  ఉండవచ్చు.

గ్లూటెన్ సెన్సిటివిటీ:

బార్లీలో గ్లూటెన్ కలిగి ఉంటుంది. కనుక సెలియాక్ వ్యాధి ఉన్నవారు లేదా గ్లూటెన్ సెన్సిటివ్ ఉన్నవారు దీన్ని తీసుకోవడానికి అనువుగా ఉండదు. వీరికి అజీర్ణ సమస్యలు, కడుపు నొప్పి, డయేరియా వంటి సమస్యలు తలెత్తవచ్చు. గ్లూటెన్ పదార్థాలతో ఎలర్జీ కలిగినవారు బార్లీని తీసుకోకూడదు.

పేగు సమస్యలు:

బార్లీ అధిక ఫైబర్ కలిగి ఉంది, కనుక ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే గ్యాస్, ఉబ్బరం, కడుపు నొప్పి, మరియు డయేరియా వంటి సమస్యలు ఉండవచ్చు.

రక్తపు చక్కెర స్థాయిలపై ప్రభావం:

బార్లీ తినడం రక్తపు చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు తమ రక్తపు చక్కెర స్థాయిలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలి.

కొంతమంది వ్యక్తులకు బార్లీని తీసుకోవడం వల్ల అకస్మాత్తుగా చర్మ వాపు, చర్మం మీద దద్దుర్లు రావచ్చు. ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా కొంతమంది వ్యక్తులకే ఉంటాయి. మీకు ఏదైనా బార్లీ తీసుకున్నప్పుడు సమస్యలు వస్తున్నాయనిపిస్తే, డాక్టర్ ను సంప్రదించడం మంచిది.

 

గమనిక:- ఇందులో ఉన్న సమాచారం మీకు ఒక అవగాహన మరియు సమాచార నిమిత్తం తెలియపరుస్తున్నాము. ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం.

మీరు ఇందులోని అంశాలను పాటించేముందు మీ వయసురీత్యా, మీ శరీరతత్వానికి మీకున్న ఇతర అనారోగ్య కారణాలు దృష్ట్యా సరైన వైద్య నిపుణులును సందర్శించి మీరు దాని విధి విధానాలను తెలుసుకొని పాటించవలెను. 

ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.