కొర్రలు - Foxtail
millet
చిరుధాన్యాలుగా పిలువబడే కొర్రలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో అద్భుతమైన ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఇందులో ఔషధ గుణాలు శరీరానికి చాలా మంచివి.
దక్షిణ భారత రాష్ట్రాల్లో బాగా విస్తృతంగా ఉపయోగించే ఆరోగ్యకరమైన మైనర్ మిల్లెట్లలో ఫాక్స్‌టైల్ మిల్లెట్స్ కూడా ఒకటి.
వీటినే కొర్రలు లు అని
పిలుస్తారు. మరికొందరు అండుకొర్రలు అంటారు.
భారత్, చైనా సహా పలు ఆసియా దేశాల్లో విరివిగా పండించే చిరు ధాన్యాలు కొర్రలు. వీటిని ఉత్తర అమెరికా మరియు యూరోపియన్లు కూడా పండిస్తారు. దక్షిణ భారత దేశంలో ఉపయోగించే చిరుధాన్యాల్లో కొర్రలు నేటికీ ప్రధానంగానే ఉంటూ వస్తున్నాయి.
కొర్రలతో అన్నం, అంబలి వంటి వంటకాలు మన దేశ ప్రజలకు అలవాటైనవే. చైనా సహా చాలా ఇతర దేశాల్లో వీటిని పాస్తా, నూడుల్స్ వంటి వాటి తయారీలోనూ వాడతారు. వీటిని దోశ, ఇడ్లీ, ఉప్మా, అన్నంలా వండుకుని తినవచ్చు.
పోషకాలు:
కొర్రల్లో పిండి
పదార్ధాలు, పీచు పదార్థాలు మరియు ప్రొటీన్లు పుష్కలంగా స్వల్పంగా కొవ్వులు ఉంటాయి.
విటమిన్స్:
బి1, బి2, బి5,
బి6, విటమిన్ ఇ వంటి విటమిన్లు, సోడియం, పొటాషియం, మెగ్నీషియం,
కాపర్, జింక్, ఫాస్ఫరస్,
ఐరన్, మాంగనీస్ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.
వీటిలో యాంటీ యాక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.
ఫాక్స్‌టైల్ మిల్లెట్‌లో
లభించే కీలకమైన విటమిన్‌ల సమాచారం ఇక్కడ చూడండి.
Thiamine - విటమిన్ B1 (థయామిన్): జీవక్రియ శక్తికి మరియు నాడీ వ్యవస్థ పనితీరుకు ఇది ఉపయోగపడుతుంది.
Riboflavin - విటమిన్ B2 (రిబోఫ్లావిన్): శక్తి ఉత్పత్తికి మరియు సెల్యులార్ పనితీరు, పెరుగుదల మరియు అభివృద్ధికి ముఖ్యమైనది.
Niacin - విటమిన్ B3 (నియాసిన్): ఆహారాన్ని శక్తిగా మార్చడంలో మరియు ఆరోగ్యకరమైన చర్మం మరియు నరాలను నిర్వహించడంలో పాత్ర పోషిస్తుంది.
Pyridoxine - విటమిన్ B6 (పిరిడాక్సిన్): ప్రోటీన్ జీవక్రియ మరియు అభిజ్ఞా అభివృద్ధి మరియు పనితీరుకు కీలకం.
Folate - విటమిన్ B9 (ఫోలేట్): DNA సంశ్లేషణ మరియు మరమ్మత్తు కోసం అవసరం, మరియు గర్భధారణ వంటి వేగవంతమైన పెరుగుదల కాలంలో కీలకం.
ఆరోగ్య లాభాలు:
1. తక్షణ శక్తినిస్తాయి. కొర్రలును తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్ఫెక్షన్ రాకుండా చూస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి ఈ కొర్రలు ఎంతగానో ఉపయోగపడతాయి.
2.
డయాబెటిస్ ఉన్నవారికి కొర్రలు చక్కని ఆహారం. అన్నంకి బదులుగా వండుకుని తినవచ్చు. దీంతో
రక్తంలో చక్కెర పరిమాణాన్ని తగ్గిస్తుంది. డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
3.
స్థూలకాయాన్ని నియంత్రిస్తాయి.
4. కడపులొ నొప్పి, ఆకలి లేకపోవడం, మూత్రంలో మంట, అతిసారం వంటి సమస్యలు ఉన్నవారు కొర్రలు తీసుకోవడం మంచిది. ఉదర సంబంధ వ్యాధులకు కొర్రలు తినడం వల్ల ఉపశమనం లభిస్తుంది.
5.
గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
6.
శరీరంలోని జీవక్రియలను, జీర్ణప్రక్రియను మెరుగుపరుస్తాయి.
7.
కొర్రలను తినడం వల్ల నాడీ మండల వ్యవస్థ ఆరోగ్యం మెరుగు పడుతుంది.
8. కొర్రలలో విటమిన్ బి మెదడు పనితీరును మెరుగు పరుస్తుంది. మెదడు
అభివృద్ధికి సహాయ పడతాయి. మెదడుకు ఆక్సిజన్ సరఫరా చేసి యాక్టివ్‌గా
ఉంచుతాయి. దీంతో జ్ఞాపకశక్తి,, ఏకాగ్రత పెరుగుతుంది.
9.
అదేవిధంగా వీటిని నిత్యం తినేవారిలో కీళ్ల నొప్పులు, మతిమరుపు కనిపించవు.
10.
కొర్రలలో ఐరన్, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. కొర్రల్లో ఉండే ఐరన్
రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. వీటిలోని కాల్షియం ఎముకలను దృఢంగా,
ఆరోగ్యంగాను ఉంచుతుంది.
11.
కొర్రల్లో విటమిన్ బి1 అల్జీమర్స్ వ్యాధి అభివృద్ధిని మందగించడానికి
సహాయపడుతుంది.
12.
వీటిని తీసుకుంటే కండరాలకు ఆక్సిజన్ సరిగ్గా అందుతుంది. కండరాలు
ఆరోగ్యంగా ఉంటాయి.
13.
పెద్ద ప్రేగుకు క్యాన్సర్ వంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
14.
కొర్రల్లో ఉన్న విటమిన్ బి1, బి3 గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. గుండె జబ్బులు
రాకుండా చూస్తుంది. గుండె జబ్బులు ఉన్నవారు కొర్రలను తింటుంటే మంచి ఫలితం
ఉంటుంది.
15.
కొర్రల్లో ఉండే విటమిన్ బి3 కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు
తీసుకుంటే ఇది శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను కరిగించి గుండె ఆరోగ్యాన్ని
మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు రోజూ కొర్రలను
తీసుకుంటే కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. దీంతో హార్ట్ ఎటాక్‌లు, గుండె సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.
16.
మలబద్దకం సమస్య ఉన్నవారు రోజూవారి ఆహారంలో కొర్రలను
తీసుకోవడం వలన మంచి ఫలితం ఉంటుంది. అలాగే జీర్ణ సమస్యలు తగ్గుతాయి. అధిక బరువును
కూడా తగ్గించుకోవచ్చు.
Nutritional Value of Foxtail Millets
(Korralu) Per 100
grams
Macronutrients:
• Calories:
Approximately 351 kcal
• Carbohydrates: 70-75 grams
• Dietary Fiber: 6-8 grams
• Protein: 10-12 grams
• Fat: 3-4 grams
• Saturated Fat: 0.7 grams
• Monounsaturated
Fat: 0.6 grams
• Polyunsaturated
Fat: 1.5 grams
Vitamins:
• Vitamin B1 (Thiamine): 0.6 mg
• Vitamin B2 (Riboflavin): 0.1 mg
• Vitamin B3 (Niacin): 3.2 mg
• Vitamin B6 (Pyridoxine): 0.1 mg
• Vitamin B9 (Folate): 20-40 µg
• Vitamin E: 0.4 mg
Minerals:
• Calcium: 31
mg
• Iron: 2.8
mg
• Magnesium: 80 mg
• Phosphorus: 290 mg
• Potassium: 250 mg
• Zinc: 2.7 mg
దుష్ప్రభావాలు:
1. కొన్ని అధ్యయనాలు ప్రకారం ఇవి
గోయిట్రోజెనిక్ ప్రభావాలను ఉత్పత్తి చేస్తాయి. థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిని
నిరోధిస్తుంది, ఇది చివరికి గాయిటర్‌కు కూడా దారితీయవచ్చు లేదా థైరాయిడ్‌ను
విస్తరించవచ్చు.
2. ఫాక్స్‌టైల్ మిల్లెట్‌లు గ్లూటెన్-రహితంగా
ఉన్నప్పటికీ, B విటమిన్లు మరియు ఫైబర్‌ల కంటెంట్ తక్కువగా ఉంటుంది.
3. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు దీని నుండి
నుండి రక్షణ ప్రభావాన్ని తగ్గించవచ్చు. ఇదొక్కటే పరిష్కార మార్గం కాదని
గుర్తించాలి.
4. మీకు పొడి చర్మం, బరువు తగ్గడం, కీళ్ల నొప్పులు మొదలైన వ్యాధి లక్షణాలు ఉంటె జాగ్రత్తగా ఉండాలి.
గమనిక:- ఇందులో ఉన్న సమాచారం మీకు
ఒక అవగాహన మరియు సమాచార నిమిత్తం తెలియపరుస్తున్నాము. ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ
వివరాలను అందించాం.
మీరు ఇందులోని అంశాలను
పాటించేముందు మీ వయసురీత్యా, మీ శరీరతత్వానికి మీకున్న ఇతర అనారోగ్య కారణాలు
దృష్ట్యా సరైన వైద్య నిపుణులును సందర్శించి మీరు దాని విధి విధానాలను తెలుసుకొని
పాటించవలెను.
ఆరోగ్యానికి సంబంధించిన ఏ
చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.