జొన్నలు - Sorghum
ఆహారం మరియు ఆరోగ్యం పట్ల ప్రతేకమైన శ్రద్ద
తీసుకునే వారు ఈ జొన్నలు ను తీసుకోవడం మంచిది.
మీరు రోజు తీసుకునే ఆహారపు అలవాట్లలో ఈ జొన్నలను
తీసుకోవడం వలన మన శరీరానికి మరింత శక్తిని, పోషకవిలువలు
అందించగలం.
గ్లూటెన్ రహిత చిరు ధాన్యాల్లో ఈ జొన్నలు కూడా బాగా వాడుకలో ఉన్నాయి.
ఆస్ట్రేలియా, ఆఫ్రికా మరియు ఆసియా ఖండాలలోని పలు దేశాల్లో జొన్నలు బాగా పండుతాయి.
జొన్నలతో ఎక్కువుగా రొట్టెలు, అంబలి వంటివి మన దేశంలో వాడుకలో ఉన్నాయి.
జొన్నలను మీరు నేరుగా తీసుకోలేకపోయినా ఉప్మా
చాలా రకాల రెస్పి లుగా తాయారు చేసి తీసుకోవచ్చు.
విదేశాల్లో వీటిని బ్రెడ్, బిస్కట్లు వంటి వాటి తయారీలో ఎక్కువగా వాడతారు.
గ్లూటెన్ సరిపడని వారికి జొన్నలు కూడా ఒక మంచి
ప్రత్యామ్నాయం.
పోషకాలు:
జొన్నల్లో పిండి పదార్థాలు, పీచు పదార్థాలు, ప్రొటీన్లు మరియు చక్కెరలు
పుష్కలంగా ఉంటాయి.
విటమిన్స్:
జొన్నల్లో విటమిన్ బి1, బి2, బి3, బి5 వంటి విటమిన్లు
ఇంకా క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం,
ఐరన్, ఫాస్ఫరస్, సోడియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.
ఆరోగ్య లాభాలు:
తెల్లగా, గుండ్రంగా
మరియు రుచికరంగా వుండే జొన్నలు మంచి బలాన్నిస్తాయి. శీఘ్రం అనే గుణం వీటికుంది,
అంటే త్వరగా శరీరంలో వ్యాపిస్తుంది.
మిగిలిన ధాన్యాలతో పోలిస్తే జొన్నలలోని పోషక
పదార్థాలు త్వరగానూ, పూర్తిగానూ శరీరం అంతా
వ్యాపిస్తాయి.
జొన్నలు ముక్యంగా 3 రకాలు అవి
నలుపు, ఎరుపు
మరియు తెలుపు.
మిస్సౌరీ విశ్వవిద్యాలయంలోని కొంతమంది
శాస్త్రవేత్తలు నలుపు, ఎరుపు మరియు తెలుపు జొన్నల
సారాలను పరీక్షించారు. ఈ మూడు రకాలు మానవ
పెద్దప్రేగు క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పనిచేసే బలమైన చర్యను కలిగి ఉన్నాయని
కనుగొన్నారు.
శరీరానికి కావాల్సిన శక్తిని అందించి రోగనిరోధక
శక్తిని పెంచుతుంది.
లైంగిక శక్తినీ మరియు వీర్యవృద్ధినీ పెంచుతాయి.
స్త్రీలకు కలిగే గర్భాశయ దోషాల్ని పోగొట్టి మేలు
చేస్తుంది.
జొన్నల్లో పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి
జీర్ణకోశానికి మేలు చేస్తాయి. శరీరంలో పేరుకుపోయిన చెడుకొవ్వును నియంత్రిస్తాయి.
ఎముకల దారుఢ్యాన్ని: ఇందులో కాల్షియం అధిక
మోతాదుతో ఉంటుంది. ఇది ఎముకలకు దృఢత్వాన్నిస్తుంది.ఈ జొన్నలు తినడం వల్ల మీ ఎముకలు బలపడతాయి.
జొన్నల్లో
ఉండే పోషక విలువలు జీవకణాలకు పునరుత్తేజం కలిగిస్తాయి.
జుట్టు రాలె సమస్యలు: జుట్టు రాలె సమస్యలు
ఇప్పుడు ఎక్కువుగా ఉన్నాయి. ఈ సమస్య ఉన్నవారు జొన్నలు తీసుకుంటే జుట్టురాలడాన్ని
నియంత్రిస్తాయి.
మలబద్దకం: మలబద్దకం సమస్యలు ఉన్నవారు జొన్నలు
తీసుకోవడం వలన మంచి ఫలితాలు ఉన్నాయి.
రక్తపోటు: అధిక రక్తపోటును నియంత్రిస్తాయి. అధిక
రక్తపోటు ఉన్నవారు ఇవి తీసుకోవడం మంచిది.
మధుమేహం: మధుమేహం ఉన్నవారు ఇవి తీసుకుంటే
మధుమేహం నియంత్రణలో ఉంటుంది.
ఇందులో ఐరన్ మరియు కాపర్ కూడా ఉంటాయి. ఇవి మీ
బ్లడ్ సర్కులేషన్ సరిగా జరిగేటట్టు చేస్తుంది. ఎలాంటి గుండె జబ్బులు మరియు
స్ట్రోక్ కానీ రాకుండా ఉంటాయి.
క్యాన్సర్ ను నిరోధిస్తుంది. క్యాన్సర్ లాంటి
వ్యాధులతో బాధపడే వారికీ, ఆపరేషన్లు జరిగిన వారికీ,
షుగర్ వ్యాధిలో పిటికలు అంటే కార్బంకుల్స్ తరచూ వ్యాపిస్తున్నవారికి
ఇది ఎంతో మేలు చేస్తాయి.
బాలింతలకు మంచి బలవర్థకమైన (బలమైన) ఆహారం.
జీర్ణసమస్యలు రాకుండా ఉంటాయి. గోధుమల కంటే
జొన్నలు తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముక్యంగా జీర్ణం సులభంగా
అవుతుంది. జీర్ణ సమస్యలు ఉన్న జీవక్రియలను మెరుగుపరుస్తుంది. సానుకూలంగా అరుగుదలకి
సహకరిస్తుంది.
రక్తంలో హిమోగ్లోబిస్ శాతాన్ని పెంచుతుంది.
కడుపులో నొప్పి, వాంతులు మరియు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ నుంచి కాపాడుతాయి
గ్యాస్, బ్లోటింగ్,
కాన్సిపేషన్, డయేరియా లాంటి సమస్యలు దూరం
అవుతాయి.
అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గడానికి ప్రయత్నం ఈ జొన్నలు. బరువు తగ్గటానికి సహాయం చేస్తాయి. శరీరంలో ఉండే చేడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తాయి.
ఇవి రోజు తీసుకోవడం వలన మీ వయసును కూడా
తగ్గిస్తుంది. వయసు కనిపించనివ్వకుండా చేస్తాయి. అంతేకాకుండా చర్మ వ్యాధులు
రాకుండా నివారించి చర్మ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.
జొన్నలు - దుష్ప్రభావాలు
ఇవి తీసుకోవడం వలన చెప్పుకోదగ్గ దుష్ప్రభావాలు ఏమి లేవనే
చెప్పుకోవాలి. జొన్నలు నిజానికి ఒక మంచి పోషకమైన ధాన్యం. కానీ ఇది మీ అన్ని
అనారోగ్యాలకు సరైనిది కాదు. ముక్యంగా ఈ ధాన్యాలను తీసుకోవడం వలన అలెర్జీ వచ్చే
ప్రమాదం మాత్రమే బహుశా గమనించవచ్చు, కానీ అలాంటి
సందర్భాలు కూడా చాలా అరుదు. అయినప్పటికీ, అతిగా ఏది
తీసుకోకూడదు. ఎప్పుడూ అతిగా తీసుకోకుండా మితంగా తీసుకుంటూ నెమ్మది నెమ్మదిగా
పెంచుకుంటూ వెళ్లడం మంచిది.
గర్భం మరియు తల్లిపాలు: గర్భిణీ లేదా తల్లిపాలు
ఇస్తున్నప్పుడు జొన్నలు సురక్షితంగా ఉందో లేదో తెలుసుకోవడానికి తగినంత విశ్వసనీయ
సమాచారం లేదు. కాబట్టి సురక్షితంగా ఉండండి. అలాంటి సందర్భాలలో సరైన వైద్యుడిని
సంప్రదించడం ఉత్తమం.
గమనిక:- ఇందులో ఉన్న సమాచారం మీకు ఒక అవగాహన మరియు సమాచార నిమిత్తం
తెలియపరుస్తున్నాము. ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను
అందించాం.
మీరు ఇందులోని అంశాలను పాటించేముందు మీ వయసురీత్యా, మీ శరీరతత్వానికి మీకున్న ఇతర
అనారోగ్య కారణాలు దృష్ట్యా సరైన వైద్య నిపుణులును సందర్శించి మీరు దాని విధి
విధానాలను తెలుసుకొని పాటించవలెను.
ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే
ఉత్తమ మార్గం. గమనించగలరు.