Ksheerabdi Kanyakaku – క్షీరాబ్ధి
కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని
క్షీరాబ్ధి కన్యకకు
శ్రీమహాలక్ష్మికిని
నీరజాలయమునకు నీరాజనం |
జలజాక్షి మోమునకు జక్కవ
కుచంబులకు
నెలకొన్న కప్పురపు
నీరాజనం |
అలివేణి తురుమునకు
హస్తకమలంబులకు
నిలువుమాణిక్యముల నీరాజనం
|| 1 ||
చరణ కిసలయములకు
సకియరంభోరులకు
నిరతమగు ముత్తేల నీరాజనం |
అరిది జఘనంబునకు
అతివనిజనాభికిని
నిరతి నానావర్ణ నీరాజనం || 2
||
పగటు శ్రీవేంకటేశు
పట్టపురాణియై
నెగడు సతికళలకును నీరాజనం
|
జగతి నలమేల్మంగ
చక్కదనములకెల్ల
నిగుడు నిజ శోభనపు
నీరాజనం || 3 ||