Nutritional Benefits of Sajjalu | Pearl Millet | సజ్జలు ఆరోగ్య ప్రయోజనాలు

సజ్జలు - Pearl Millet

 

భారత ఉపఖండం, మరియు ఇతర విదేశీ ప్రాంతాల్లో వాడుకలో ఉండే కొన్ని చిరుధాన్యాల్లో సజ్జలు ఒకటి. సజ్జల ఉత్పాదనలో భారత్ దే అగ్రస్థానం.

 

గ్లూటెన్ కారణంగా గోధుమలు సరిపడని వారికి గ్లూటెన్ రహిత సజ్జలు చక్కటి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడతాయి.

 

సజ్జలతో రొట్టెలు, అంబలి వంటివి మన దేశంలో వాడుకలో ఉన్నాయి.

 

స‌జ్జ‌ల్లో విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ మరియు ప్రోటీన్స్ ఎక్కువ‌గా - క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి.

 

విదేశాల్లో బ్రెడ్, కేకులు, బిస్కట్లు వంటి పదార్థాల తయారీలో సజ్జలను వాడతారు.

 

పోషకాలు:

 

సజ్జల్లో పిండి పదార్థాలు, పీచు పదార్థాలు మరియు ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు స్వల్పంగా కొవ్వులు, విటమిన్ బి1, బి2, బి3, బి5, బి6, బి9, విటమిన్ ఇ, విటమిన్ కె వంటి విటమిన్లు, క్యాల్షియం, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్, కాపర్, పొటాషియం, ఐరన్సోడియంసెలీనియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.

 

ఆరోగ్య లాభాలు:

1.             సజ్జలు రోగనిరోధక శక్తిని పెంచి ఆరోగ్యాన్నిస్తుంది.

2.             సజ్జల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉండటంతో కండరాలకు మంచి శక్తినిస్తాయి.

3.             కండరాలకు బలాన్నిస్తుంది.

4.             ఇందులో ఉండే కాల్షియం ఎముకలను దృఢంగా ఉంచుతాయి. ఎముకలు బలానికి కాల్షియం మంచిది.

5.             జీర్ణకోశాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. 

6.             రక్తహీనతను అరికడతాయి. రక్తంలో ఉండే కొవ్వును కరిగిస్తుంది.

7.             డయాబెటిస్ ఉన్నవారు దీనిని తీసుకోవడం వలన టైప్-2 డయాబెటిస్ ముప్పును గణనీయంగా నివారిస్తాయి.

8.             ప్రతిరోజూ సజ్జలు తినడం వల్ల స్థూలకాయాన్ని తగ్గించుకోవచ్చు.

9.             అధిక బ‌రువుతో బాధ‌పడే వారు రోజూ కొన్ని మొల‌కెత్తిన స‌జ్జ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల చాలా త్వ‌ర‌గా బ‌రువు తగ్గవచ్చు.

10.         శరీరంలో ఐరన్ లోపం ఉంటే ఆరోగ్యం దెబ్బతింటుంది. ఐరన్ పుష్కలంగా ఉన్న ఈ సజ్జలు తినడం చాలా మంచిది.

11.         సజ్జల్లో ఉండే మెగ్నీషియం, పొటాషియం బ్లడ్ ప్రెజర్ ని కంట్రోల్ లో ఉంచుతాయి. పైగా మెగ్నీషియం హార్ట్ ఎటాక్ లేదా స్ట్రోక్ వచ్చే రిస్క్ తగ్గిస్తుంది అని అంటారు.

12.         ఆహారంలో సజ్జలను తరచుగా తీసుకుంటున్నట్లయితే గాల్ స్టోన్స్ ఏర్పడకుండా ఉంటాయని తాజా పరిశోధనల్లో తేలింది.

13.         సజ్జలు తీసుకోవడం వలన శ‌రీరంలోని వ్య‌ర్థ ప‌దార్థాలు తొల‌గిపోవ‌డంతోపాటు ప‌లు ర‌కాల క్యాన్సర్ ల బారిన కూడా ప‌డ‌కుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

14.         స‌జ్జ‌ల‌ను రోజు తీసుకోవ‌డం వల్ల శ‌రీరంలో అనవసరంగా  పేరుకుపోయిన కొవ్వు తొల‌గిపోతుంది. దాంతో పాటు పొట్ట చుట్టూ ఉన్న  కొవ్వు కూడా తొల‌గిపోతుంది.

15.         షుగ‌ర్ వ్యాధి గల వారు స‌జ్జ‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయి అదుపులో ఉంచుతుంది.

 

దీనిలో వేడిని కలిగించే గుణం ఎక్కువ. అందుకు ప్రత్నామ్యాయంగా చలువ పదార్ధాలు తీసుకుంటే సరిపోతుంది.