రాగులు (Finger Millet)
రాగి వార్షిక ధాన్యపు
పంట.
రాగి (Finger Millet) ని ఫింగర్ మిల్లెట్
లేదా ఆఫ్రికన్ మిల్లెట్ అని పిలుస్తారు.
భారత్ సహా ఆసియా, ఆఫ్రికా దేశాల్లోనూ వాడుకలో ఉండే
చిరుధాన్యం రాగులు. చౌకగా దొరికే చిరుధాన్యాల్లో ఎక్కువగా వినియోగంలో ఉన్నవి
రాగులే.
ముఖ్యంగా దీనిని ఆఫ్రికా
మరియు ఆసియాలోని మెట్టప్రాంతాల్లో
పండిస్తారు. ఇది ఎత్తు ప్రాంతాల యొక్క వాతావరణానికి సులువుగా అలవాటుపడి
పండే పంట. హిమాలయాల పర్వత పరిసర
ప్రాంతాల్లో 2300 మీటర్ల ఎత్తువరకు రాగిని పండిస్తారు.
మన భారత దేశంలో రాగి
ముద్ద, రాగి
జావ, రాగి రొట్టెలుగా చాలా ప్రాంతాల్లో నేటికీ వినియోగంలో
ఉన్నాయి.
పోషకాలు:
రాగుల్లో పిండి పదార్థాలు, పీచు పదార్థాలు, ప్రొటీన్లు, పుష్కలంగా - నామమాత్రంగా కొవ్వు
పదార్ధాలు ఉంటాయి. వీటితో పాటు విటమిన్ బి1, బి2, బి,3 బి5, బి6, బి9 వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్ మరియు ఫాస్ఫరస్ వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి.
ఆరోగ్య లాభాలు:
1. సులభంగా మరియు నెమ్మదిగా జీర్ణమయ్యే
రాగులు రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం మేలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
2. నెమ్మదిగా జీర్ణమయ్యే రాగులు శక్తిని
ఇవ్వడంతో పాటు త్వరగా నీరసించిపోకుండా చూస్తాయి.
3. ముక్యంగా రాగుల్లో తక్కువ మోతాదులో
కార్బోహైడ్రేట్లూ, చక్కెర
నిల్వలూ, ఎక్కువ మొత్తంలో పీచు పదార్ధాలు ఉంటాయి.
4. రాగితో చేసిన పదార్థాలను రోజూ తీసుకోవడం
వల్ల పోషకాహారం సరియైన మోతాదులో శరీరానికి అందుతుంది.
5. రాగులను క్రమం తప్పకుండా తీసుకుంటే
పోషకాహార లోపాన్ని, ఇంకా
వయసుతో పాటు వచ్చే సమస్యలు మరియు త్వరగా వృద్ధాప్యం బారిన పడకుండానూ చేస్తుంది.
6. తరచూగా రాగుల్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల
జీర్ణప్రకియ మెరుగుపడి, మలబద్ధకం సమస్య దూరమవుతుంది.
7. రాగులు స్థూలకాయాన్ని దూరం చేస్తుంది.
గోధుమల్లోని గ్లూటెన్ సరిపడని వారికి ఈ రాగులు సరైన ప్రత్యామ్నాయంగా ఉపయోగపడతాయి.
8. మధుమేహంతో బాధపడుతున్న వారికి రాగులు మంచి
ఆహారం. దీనిలోని ఫైటో కెమికల్స్ జీర్ణ ప్రక్రియను నెమ్మదించేలా చేస్తాయి.
జీర్ణక్రియ వేగాన్ని తగ్గిస్తాయి. గ్లూకోజ్ త్వరగా విడుదల కాదు. తద్వారా రక్తంలోకి
గ్లూకోజ్ నెమ్మదిగా విడుదల అవుతుంది. అందువల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుంది.
9. వీటిల్లోని ట్రిప్టోథాన్ అమైనో ఆమ్లం
ఉంటాయి. ఇవి శారీరక, మానసిక
ప్రశాంతతకు దోహదం చేస్తుంది.
10.
ఆందోళన, కుంగుబాటు,
నిద్రలేమి వంటి ఇతర సమస్యలు ఉన్నవారు వీటిని తీసుకోవడం మంచిది.
కొన్నిరకాల పార్శ్వనొప్పులు తగ్గటానికీ ఉపయోగపడుతుంది.
11.
విటమిన్ బి3 శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.
12.
రాగుల్లో ఉండే క్యాల్షియం ఎముకలకు బలాన్ని పెంచుతుంది.
13.
ఎదుగుతున్న పిల్లలకు,
వృద్ధులకు రాగులు ఎంతో మేలు చేస్తాయి. పిల్లల్లో ఎముకల ఎదుగుదలకు,
వృద్ధుల్లో ఎముకలు దృఢత్వానికి, ఆరోగ్యంగా
ఉండటానికి ఇవి తోడ్పడతాయి.
14.
ఎముకలకు బలాన్ని ఇవ్వడమే కాకుండా దీనిలో సహజంగా లభించే ఐరన్ రక్త హీనతను
నివారిస్తుంది. రక్తహీనతను దూరం చేస్తుంది.
15.
రాగులతో చేసిన ఆహారం రోజూ తీసుకోవడం వల్ల పెద్దపేగుకి తగిన నీటి నిల్వలు
అందుతాయి.
16.
రాగుల్లో తగిన మోతాదులో లభించే మెగ్నీషియం మైగ్రెయిన్ తలనొప్పీ, గుండె సంబంధిత వ్యాధులకు చక్కని పరిష్కారాన్ని
చూపిస్తుంది.
17.
రాగుల్లో అధిక మోతాదులో యాంటీ ఆక్సిడెంట్లూ ఉంటాయి. ఇవి క్యాన్సర్ కారకాలైన ఫ్రీరాడికళ్లను బయటకు
పంపించి ఆరోగ్యంగా ఉంచుతాయి.
18.
రాగులు రోజు ఆహారంలో తీసుకోవడం వలన ఆకలిని తగ్గించి ఊబకాయం రాకుండా
కాపాడుతుంది.
19.
రాగుల్లోని ట్రిప్టోథాన్ అనే అమైనో ఆమ్లం ఆకలిని తగ్గిస్తుంది. దీనిలోని
ఫైటో కెమికల్స్ జీర్ణ ప్రక్రియను నెమ్మదించేలా చేస్తాయి. ఇవి నెమ్మదిగా
జీర్ణమవుతాయి కాబట్టి అదనంగా శరరంలో కేలరీలు పోగుపడకుండా చూస్తాయి. వీటిల్లోని
పీచు కడుపు నిండిన భావన కలిగించి,
కడుపు నిండిన అనుభూతి కలిగి ఎక్కువగా తినకుండా చేస్తాయి.
20.
మీ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
రాగులు - దుష్ప్రభావాలు
రాగులను ఒక మోస్తరు మోతాదులో
తీసుకుంటే మంచిది సురక్షితం. రాగులు యొక్క అధిక వినియోగం ప్రతికూల ప్రభావాన్ని
కలిగిస్తుంది.
1. కిడ్నీ స్టోన్స్ కారణం కావచ్చు
ఫింగర్ మిల్లెట్‌లోని కాల్షియం మీ
శరీరంలో ఆక్సాలిక్ యాసిడ్‌ను పెంచి,
మూత్రపిండాల్లో రాళ్లకు దారితీయవచ్చు. మీకు కిడ్నీలో రాళ్లు లేదా
యూరినరీ సమస్యలు ఉన్నట్లయితే, ఫింగర్ మిల్లెట్‌ను తక్కువుగా తీసుకోవాలి. ఈ సమస్యలు అధికంగా ఉన్నవారు
దీనిని తీసుకోకపోవడం ఉత్తమం.
2. థైరాయిడ్ సమస్య
రాగిలో గాయిట్రోజెన్‌లు ఉంటాయి. ఇవి
థైరాయిడ్ పనితీరుకు ఆటంకం కలిగించే పదార్ధాలను కలిగి ఉంటాయి. ముక్యంగా థైరాయిడ్
గ్రంధి హార్మోన్ల ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తుంది.
థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు ఫింగర్ మిల్లెట్‌ను తీసుకునే ముందు డాక్టర్
ను సంప్రదించి తీసుకోవడం మంచిది. మీ థైరాయిడ్ ఎలా పని చేస్తుందో మరియు మీ మందుల
అవసరాలను ఎలా ప్రభావితం చేస్తుందో
సంప్రదించి తీసుకోవాలి. అందువల్ల,
థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు రాగులు వినియోగాన్ని పరిమితం చేయడం
మంచిది.
3. గాయిటర్ ఆందోళనలు
థైరాయిడ్ గ్రంధి విస్తరించడం వల్ల
మెడలో వాపు ఏర్పడుతుంది. ఒక గాయిటర్ సరిగా పనిచేయని థైరాయిడ్‌తో సంబంధం కలిగి
ఉంటుంది. గ్రంథివాపు వ్యాధి లేదా గైటర్ అయోడిన్ లోపము వలన కలుగు వ్యాధి.
కొంతమందిలో థైరాయిడ్ గ్రంధి (గోయిటర్) విస్తరించడానికి దారితీస్తుంది. శరీరానికి
అయోడిన్ అవసరం ఉంటుంది. ఈ అయోడిన్ వినియోగాన్ని నిరోధిస్తుంది. ఇది ఎక్కువుగా
అయోడిన్ లోపం వలన వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా, 90% కంటే ఎక్కువ గాయిటర్ కేసులు అయోడిన్ లోపం
వల్ల సంభవిస్తాయి.
4. జీర్ణ సమస్యలకు కారణం కావచ్చు
ఫింగర్ మిల్లెట్ లో అధిక ఫైబర్
కంటెంట్‌ను కలిగి ఉంటుంది. ఇది కొంతమంది వ్యక్తులలో, ముఖ్యంగా సున్నితమైన కడుపు ఉన్నవారు, పీచు పదార్ధాలను సరిగా జీర్ణించుకోలేని వారు, రాగులను
తీసుకున్న తరువాత కడుపు ఉబ్బరం, గ్యాస్ మరియు అతిసారం వంటి
జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. ఈ సమస్యను అధిగమించడానికి తక్కువగా తగు మోతాదులో
తీసుకోవాలి.
5. తీవ్రమైన మలబద్ధకం:
రాగులు నెమ్మదిగా జీర్ణమవుతాయి
కాబట్టి, దాని అధిక
వినియోగం తీవ్రమైన మలబద్ధకం సమస్యలను కలిగిస్తుంది. మలబద్ధకం సమస్యలు ఎక్కువగా
ఉన్నవారు, రాగులను క్రమం తప్పకుండా తీసుకోవడం మానేయాలి.
ఎందుకంటే ఇది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. మలబద్ధకం మరింత పెరిగే
అవకాశం ఉంది.
సూచన: థైరాయిడ్ వ్యాధి, గాయిటర్ వ్యాధి, మూత్రపిండాల్లో
రాళ్ళూ ఉన్నవారు సరియైన వైద్యుడిని సంప్రదించి తీసుకోవాలని సూచన.