Oats Health Benefits | ఓట్స్ ఆరోగ్య ప్రయోజనాలు

ఓట్స్ - Oats

ఓట్స్ సాదారాణ తృణ ధాన్యము కేటగిరికి చించినదే. ఓట్స్ అంటే ధాన్యపు ఆహారం. ఇవి గ్లూటెన్ రహిత ధాన్యాలు. ఇది అవెనా సాటివా మొక్క అంటే బార్లీ నుండి తయారు చేయబడింది. వరి నుండి అటుకులు చేసి ఎలా తింటున్నామో వీటినీ కూడా మనం అలా తినవచ్చును.

 

ఓట్స్‌ని తినడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. దీనిని తీసుకోవడం చాలా సులభం. దాంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది.

 

ఇటీవలి కాలంలో మన దేశంలో ఓట్స్ వినియోగం కొంత పెరుగుతోంది.

 

ఓట్స్ ను నేరుగా ఉడికించి తినడం, లేదా పాలలో కలుపుకుని తినడం, రకరకాల వంటకాల్లో వాడటంతో పాటు ఓట్స్ ను బ్రెడ్ మరియు బిస్కట్ల తయారీలోనూ ఉపయోగిస్తారు.

 

చాలా మంది ఉదయం బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లి, దోస, ఉప్మా మొదలైన టిఫిన్ కి   బదులుగా ఓట్స్ తీసుకుంటూ ఉంటారు. వారు చాలా ఆరోగ్యాంగా ఉంటారు.

 

పిల్లలు తినే ఆహారంలో ఓట్స్‌ను ఏదో ఒక రూపంలో ఇవ్వడం వల్ల మంచి పోషక విలువలు లభిస్తాయి.

 

ముక్యంగా దీనిని అధిక బరువు ఉన్నవారు నియంత్రణ కోసం తీసుకుంటున్నారు. ఇది తక్కువుగా తిన్నా, ఎక్కువగా తిన్నామన్న ఫీలింగ్ కలిగినట్లు చేస్తుంది. అయితే దీనిని అమితంగా తినడం కూడా తప్పే. అలా తింటే కొన్ని రకాల దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి.

 

మంచి చేడు కలగలిసిన ఓట్స్ మనకు ఎలాంటి ఆరోగ్యాన్ని ఇస్తుందో మరియు దాని దుష్ప్రభావాలు గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం.

 

ఓట్స్‌లో అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.

 

ఓట్స్ 2 రకాలు.

1.      రోల్డ్ ఓట్స్ (rolled oats)

2.      స్టీల్ కట్ ఓట్స్ (steel cut oats).

 

 

రోల్డ్ ఓట్స్‌ :

ఎక్కువగా ప్రాసెసింగ్ చేసి వీటిని తయారు చేస్తారు. స్ట్రీమింగ్ మరియు ఫ్లేటనింగ్ ప్రాసెస్ చేసి వీటిని తయారు చేస్తారు.

 

స్టీల్ కట్ ఓట్స్ :

తక్కువగా ప్రాసెస్ చేసి వీటిని తయారు చేస్తారు.  ఇది తినడానికి  బాగుంటాయి.

ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఓట్స్ ను నీళ్లలో లేదా పాలలో వేసి కొద్దిగ మరిగించి తినేయొచ్చు.

 

రెండింటితో పోలీస్తే తక్కువుగా ప్రాసెస్ చేసిన స్టీల్ కట్ ఓట్స్ మంచిది.

కానీ రెండూ రకాల ఓట్స్ కూడా ఇంచుమించు ఒకే లాగ పోషక పదార్థాలు కలిగి ఉంటాయి.

 

ఓట్స్ లో ఉండే పోషకాలు గురించి తెలుసుకుందాం:

 

ఓట్స్ లో  పిండి పదార్థాలు, పీచు పదార్థాలు, ప్రొటీన్లు, స్వల్పంగా కొవ్వులు ఉంటాయి.

విటమిన్ - బి1, బి2, బి5, బి6, బి9 వంటి విటమిన్లు, క్యాల్షియం, మెగ్నీషియం, సోడియం, మాంగనీస్, ఐరన్, పొటాషియం, ఫాస్ఫరస్జింక్సెలీనియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.

 

ఆరోగ్య లాభాలు:

ఓట్స్ లో పీచు పదార్థాలు పుష్కలంగా ఉండటంతో జీర్ణకోశానికి మేలు చేస్తాయి. జీర్ణవ్యవస్ధ సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది.

 

ఉదర క్యాన్సర్ మరియు పేగుల క్యాన్సర్ ముప్పును తగ్గిస్తాయి.

 

ఓట్స్ అధిక రక్తపోటు ఉన్నవారికి చాలా మంచిది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

 

అధిక ఒత్తిడితో ఉండేవారు మీ రోజువారీ ఆహారంలో ఇది తీసుకుంటే మీలోని ఒత్తిడిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి మీ రోజువారీ ఆహారంలో ఓట్‌మీల్‌ను చేర్చుకోవాలి.

 

డయాబెటిస్ తో బాధపడే వారికి ఇది చాలా మంచిది. ఓట్స్‌లో అధిక ఫైబర్ ఉంటుంది. నెమ్మదిగా జీర్ణమవుతూ రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. మధుమేహం ఉన్నవారు మీ రోజువారీ ఆహారంలో ఓట్స్‌ తీసుకోవడం మంచిది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. కాబట్టి ఇది డయాబెటిస్‌ ఉన్నవారు తీసుకుంటే మధుమేహం నియంత్రణలో ఉంటుంది.

 

ఓట్స్ లో ఎక్కువుగా పీచు పదార్ధాలు ఉంటాయి. స్థూలకాయాన్ని అరికడతాయి. ఇవి తీసుకోవడం వల్ల కడుపు ఎక్కువసేపు నిండుగా అనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల తక్కువుగా తినడానికి ఇష్టపడతారు. తద్వారా  మీ బరువు అదుపులో ఉంటుంది.

 

ఓట్స్‌కి జిగురు గుణాన్ని తెచ్చిపెట్టే పీచు ఉంది. అది రక్తంలోని కొలెస్ట్రాల్‌ను వేరుచేస్తూ, కొలెస్ట్రాల్‌ను తగ్గించటంలో తోడ్పడుతుంది.

 

ఓట్స్ లో పెద్దమొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి అనారోగ్యం కలిగించే ఫ్రీరాడికల్స్‌తో పోరాడడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

 

ఓట్స్ తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉండటమే కాకుండా చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి.

 

ఓట్స్‌లో ఫైబర్ మరియు బేటా-గ్లూకాన్ లు ఉంటాయి. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మీకు ఏదైనా గాయం అయినపుడు ఇది ఆ  గాయం నయం చేయడంలోనూ మరియు రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ సహాయపడతాయి.

 

ఓట్స్‌లో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇది మొటిమలతో పోరాడుతుంది. చర్మంలో ఉండే అదనపు నూనెను గ్రహిస్తుంది. తద్వారా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

 

ఓట్స్ లిగ్నాన్స్ కు మూలం. ఇవి బాడీకి యాంటీ ఆక్సిడెంట్స్ గా పనిచేస్తాయి. అండాశయాలు, రొమ్ము, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి క్యాన్సర్ సంబంధిత కారకాలతో పోరాడుతాయి.

 

ఓట్స్ దుష్ప్రభావాలు:

ఓట్స్ తరచుగా అధిక వినియోగం చేస్తే దుష్ప్రభావాలకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు .

 

ఓట్స్ కార్బోహైడ్రేట్లకు మూలం. అతిగా తినడం వలన మీ బరువు పెరగవచ్చు.

 

ఇది చప్పగా ఉండే స్వభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి, చక్కెర స్థాయి తక్కువుగా ఉందనుకొని ఓట్స్‌ను అధికంగా తీసుకోవడం వల్ల చక్కెర స్థాయి పెరుగుతుంది.

 

రోజూ ఓట్స్ ఎక్కువుగా తినడం వల్ల కడుపు ఉబ్బరం వచ్చే అవకాశం ఉంది.

 

కేవలం ఓట్స్ మాత్రమే ఎంచుకోవడం వలన మీ శరీరానికి ఇతర ఆరోగ్యకరమైన ఆహార వనరుల నుండి పోషణ లభించదు. ఓట్స్ ఒక్కటే ప్రత్యామ్నాయం కాదు.

 

ఓట్స్ లో ఉండే దుష్ప్రభావాలను తగ్గించడానికి, తక్కువ మోతాదుతో ప్రారంభించండి. తరువాత కావలసిన దానికి నెమ్మదిగా పెంచండి. 

 

గమనిక:- ఇందులో ఉన్న సమాచారం మీకు ఒక అవగాహన మరియు సమాచార నిమిత్తం తెలియపరుస్తున్నాము. ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం.

మీరు ఇందులోని అంశాలను పాటించేముందు మీ వయసురీత్యా, మీ శరీరతత్వానికి మీకున్న ఇతర అనారోగ్య కారణాలు దృష్ట్యా సరైన వైద్య నిపుణులును సందర్శించి మీరు దాని విధి విధానాలను తెలుసుకొని పాటించవలెను. 

ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.