ఉలవలు (Horse Gram)
ఈ ఉలవలు భారత ఉపఖండంతో పాటు దక్షిణాసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఉలవలను ఎక్కువుగా వినియోగిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఉలవచారు బాగా ప్రసిద్ధి పొందితే, ఉత్తరాది రాష్ట్రాల్లో ఉలవలతో కిచిడీలా తయారు చేసుకుంటారు. కామెర్ల వంటి మొండి వ్యాధులతో బాధపడే రోగులకు సిద్ధ, ఆయుర్వేద వైద్య పద్ధతుల్లో ఉలవలతో చేసే సంప్రదాయ వంటకాలతో తయారు చేసి పెడతారు.
పోషకాలు: ఉలవల్లో ప్రొటీన్లు, పిండి పదార్థాలు, పీచు పదార్థాలు, క్యాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ వంటి ఖనిజలవణాలు మరియు కార్బోహైడ్రేట్లు ఉంటాయి.
ఆరోగ్య లాభాలు: ఉలవల్లో పీచు పదార్థాలు, ప్రొటీన్లు మరియు కార్బోహైడ్రేట్లు ఎక్కువగా
ఉండటం వల్ల వీటిని పుష్టికరమైన ఆహారంగా పరిగణిస్తారు. ఉలవలు స్థూలకాయాన్ని
అరికడతాయి. ముఖ్యంగా నెలసరి సమస్యలు ఉన్న స్త్రీలకు, ఇంకా కామెర్ల రోగస్థులకు మరియు కిడ్నీలో రాళ్లు ఉన్నవారు తీసుకుంటే ఉలవలు
మేలు చేస్తాయని ఆయుర్వేద, సిద్ధ వైద్యు నిపుణులు చెబుతారు.
ఆంధ్ర ప్రదేశ్‌లో గుర్రపు పప్పును సాధారణంగా ఉలవ అని పిలుస్తారు మరియు ఉలవ చారు
(గుర్రపు పప్పు పులుసు), ఉలవ కట్టు (అంటే ముద్దగా) ఇలా
అనేక ప్రసిద్ధ వంటకాన్ని తయారు చేయడానికి ఉపయోగిస్తారు.
ఈ ఉలవలను కనీసం 7, 8 గంటల పాటు నానబెడితేనే పూర్తిగా నానతాయి. అంటే ఇవి రాత్రిపూట నానబెడితే ఉదయానికి వాడుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది.
ఇంకా ఈ ఉలవలు హిందువులు నవగ్రహాలకు పూజ చేసే నవధాన్యాలలో ఒకటిగా పరిగణిస్తారు.
ఉలవలు (Horse Gram) ఉపయోగాలు:
1. ఇది వార్మ్ ఇన్ఫెక్షన్ల నుండి జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి క్లియర్ చేయడంలో సహాయపడుతుంది, అపానవాయువు ఆమ్లతను తగ్గిస్తుంది మరియు జీర్ణవ్యవస్థ పనితీరును మంచి స్థితిలో ఉంచుతుంది.
2. ఉలవలు క్రమంగా తీసుకుంటే ఆకలిని పెంచుతుంది. గొంతు, ఊపిరితిత్తులు మరియు గుండె పరిసర ప్రాంతాల్లో ఉండే కఫాన్ని కరిగించి పల్చగా మార్చి బయటకు పంపిస్తాయి.
3. ఉలవల్లో ప్రోటీన్స్ మరియు ఖనిజ సంబంధ పదార్థాలూ ఎక్కువ. ఎదుగుతున్న పిల్లలకు ఇది ఇవ్వడం వలన ఒక మంచి టానిక్ లా ఉపయోగపడుతుంది.
4. స్త్రీలుకు బహిష్టు కావడములో తలెత్తే సమస్యలుని, లోపములను (menstural disorders) పోగొట్టును.
5. ఊపిరితిత్తులులో పెరిగిన కఫమును (లేక) శ్లేష్మమును కరిగించును.
6. వాతము, శ్వాస, మూలవ్యాధి మరియు మలబద్ధకము వంటి వాటినుండి ఉపశమనం కలిగించును.
7. కళ్లల్లో నుండి నీరు కారటం మరియు కళ్లలో పుసులు కట్టడం వంటి సమస్యలు ఉన్నప్పుడు ఇవి తీసుకుంటే మంచిది.
8. తరచూగా ఎక్కిళ్లు వస్తుంటే ఉలవలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
9. స్థూలకాయంతో బాధపడే వారు ఉలవలను ఆహార రూపంలో తీసుకుంటే స్థూలకాయం తగ్గుతుంది.
10. అధిక బరువుతో బాధపడేవారు ఎటువంటి శ్రమ లేకుండా ఒక కప్పు ఉలవలు, నాలుగు కప్పులు నీళ్లు కలిపి కుక్కర్‌లో ఉడికించాలి. ఇలా తయారుచేసుకున్న మిశ్రమాన్ని ‘ఉలవకట్టు’ను ప్రతిరోజూ ఉదయంపూట ఖాళీ కడుపుతో, సరిపడా ఉప్పు కలిపి తీసుకుంటూ ఉంటే క్రమంగా సన్నబడతారు.
11. మూత్రాశయంలో రాళ్ళూ ఉన్నవారు ఈ ఉలవలు తీసుకుంటే చాలా సులువుగా రాళ్లను కరిగించి వెలుపలకు రావడానికి ఉలవలు సహకరిస్తాయి.
12. కాళ్లు, చేతులు, ఒళ్లు నొప్పులు, వాపులు ఉన్నవారు ఉలవలను ఒక పిడికెడు తీసుకొని పెనంమీద చిన్నగా వేయించి మందపాటి గుడ్డలో మూటకట్టి నొప్పిగా ఉన్న భాగంలో నెమ్మదిగా కాపడం చేయాలి. నొప్పులు తగ్గి మంచి ఉపశమనం కలుగుతుంది.
13. బోదకాలు, కాళ్లవాపు ఉన్నవారు ఉలవల పిండినీ, పుట్టమన్ను ఒక్కోటి పిడికెడు చొప్పున తీసుకొని సమంగా కలపాలి. దీనికి కోడిగుడ్డులో ఉండే తెల్లసొనను తీసుకొని కలిపి స్థానికంగా లేపనంచేస్తే హితకరంగా ఉంటుంది.
14. ఉలవలను రోజు తీసుకోవటంవల్ల మల నిర్వహణ సజావుగా మరియు సాఫీగా జరుగుతుంది.
15. ఉలవలను మీ ఆహారంలో వాడేవారికి మూత్ర విసర్జన ధారాళంగా, నిరాటంకంగా జరుగుతుంది.
16. మహిళల్లో బహిష్టు అయినటువంటి సమయంలో రక్తం కష్టం లేకుండా విడుదలవుతుంది.
17. అల్సర్లు ఉన్నవారు పావు కప్పు ఉలవలను, కొద్దిగా పొంగించిన ఇంగువను, పావు టీస్పూన్ అల్లం ముద్దను, పాపు టీ స్పూన్ అతిమధురం వేరు చూర్ణాన్నీ వీటికి తగినంత నీటిని కలిపి ఉడికించాలి. దీనికి తేనె కలిపి నెలరోజులపాటు తీసుకుంటే బాహ్యంగా మరియు అంతరంగంగా తయారైన వ్రణాలు (అల్సర్లు) త్వరగా తగ్గుతాయి.
18. లైంగిక శక్తి కోసం ఉలవలను మరియు బియ్యాన్నీ సమంగా తీసుకొని జావ మాదిరిగా తయారుచేయాలి. లైంగిక శక్తి కోసం దీనిని పాలతో కలిపి కొన్ని వారాలపాటు క్రమం తప్పకుండా తీసుకుంటే లైంగిక శక్తితో పాటు శృంగారానురక్తి కూడా పెరుగుతుంది.
ఉలవలు (Horse Gram) దుష్ప్రభావాలు :
ఉలవలు తీసుకోవడం వలన మనం ఇప్పటివరకు అనేక లాభాలు గురుంచి తెలుసుకున్నాము. అదేవిదంగా వీటితో కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి . వాటిని ఇప్పుడు మనం తెలుసుకుందాం.
1. ఈ ఉలవలు ఎక్కువగా తీసుకోవడం వలన అధిక వేడి చేసే గుణం ఉంటుంది. కనుక ఉలవలు తిన్నరోజున తగినంత మజ్జిగ కూడా తీసుకుంటే శరీరానికి వేడి చేయదు. ఈ ఉలవలను నేరుగా తినడం కన్నా పైన తెలిపి విధంగా ఉడికించి, మొలకలెత్తించినవి లేదా వేయించి పొట్టు తీసినవి తిన్నప్పుడు పోషకాల విలువ మరింత పెరిగి మంచి ఫలితాలు ఆరోగ్యాన్నిస్తుంది.
2. ఉలవలు (Horse Gram) లో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది యాంటీ న్యూట్రియంట్ - అంటే ఉలవలులో
ఉండే పోషకాల మంచితనాన్ని గ్రహించకుండా ఆపగలదు.
నివరణ: ఉలవలు గింజలను మీ ఆహారంలో వేసే
ముందు వాటిని నానబెట్టడం, మొలకెత్తడం
లేదా ఉడికించడం వంటివి చేస్తే, ఫైటిక్ యాసిడ్ కంటెంట్ గణనీయంగా తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
100 గ్రాములకి ఉలవలు (Horse Gram) గుర్రపు గ్రాములో లభించే విటమిన్లు, ఖనిజాలు మరియు పోషక విలువల యొక్క వివరణాత్మక విచ్ఛిన్నం ఇక్కడ ఉంది:
విటమిన్లు:
విటమిన్ సి: 5.0 మి.గ్రా
విటమిన్ A: 3 IU (అంతర్జాతీయ
యూనిట్లు)
ఖనిజాలు:
కాల్షియం: 287 మి.గ్రా
ఐరన్: 7 మి.గ్రా
మెగ్నీషియం: 311 మి.గ్రా
భాస్వరం: 311 మి.గ్రా
పొటాషియం: 1246 మి.గ్రా
పోషక విలువలు:
కేలరీలు: 321 కిలో
కేలరీలు
ప్రోటీన్: 22.3 గ్రాములు
కొవ్వు: 0.5 గ్రాములు
కార్బోహైడ్రేట్లు: 57.3 గ్రాములు
ఫైబర్: 5.3 గ్రాములు
ఇనుము, కాల్షియం, మెగ్నీషియం మరియు పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలతో పాటుగా అధిక
ప్రోటీన్ మరియు ఫైబర్ కంటెంట్ కోసం ఉలవలు ప్రత్యేకించి గుర్తించదగినది.
గమనిక:- ఇందులో ఉన్న
సమాచారం మీకు ఒక అవగాహన మరియు సమాచార నిమిత్తం తెలియపరుస్తున్నాము. మీరు ఇందులోని
అంశాలను పాటించేముందు మీ వయసురీత్యా, మీ శరీరతత్వానికి మీకున్న
ఇతర అనారోగ్య కారణాలు దృష్ట్యా సరైన వైద్య నిపుణులును సందర్శించి మీరు దాని విధి
విధానాలను తెలుసుకొని పాటించవలెను.
ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను
సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు. వేరే ఇతరత్రా సమస్యలకు మా బ్లాగ్ బాధ్యత
వహించదు. గమనించగలరు.