Sri Lalita Devi Moola Mantra Kavacham - శ్రీ లలితా దేవి మూలమంత్ర కవచం


Sri Lalita Devi Moola Mantra Kavacham - శ్రీ లలితా దేవి మూలమంత్ర కవచం 

అస్య శ్రీ లలితా కవచస్తవరత్న మంత్రస్య ఆనందభైరవ ఋషిః అమృత విరాట్ ఛందః శ్రీ మహాత్రిపురసుందరీ లలితా పరాంబా దేవతా ఐం బీజం హ్రీం శక్తిః శ్రీం కీలకం, మమ శ్రీ లలితాంబా ప్రసాదసిద్ధ్యర్థే శ్రీ లలితాకవచస్తవరత్నం మంత్ర జపే వినియోగః |

కరన్యాసః

ఐం అంగుష్ఠాభ్యాం నమః

హ్రీం తర్జనీభ్యాం నమః

శ్రీం మధ్యమాభ్యాం నమః

శ్రీం అనామికాభ్యాం నమః

హ్రీం కనిష్ఠికాభ్యాం నమః

ఐం కరతలకరపృష్ఠాభ్యాంనమః

 

అంగన్యాసః

ఐం హృదయాయ నమః

హ్రీం శిరసేస్వాహా నమః

శ్రీం శిఖాయైవషట్ నమః

శ్రీం కవచాయహుం

హ్రీం నేత్రత్రయావౌషట్

ఐం అస్త్రాయ ఫట్

భూర్భువస్సువరోమితి దిగ్బంధః||

 

ధ్యానం

శ్రీ విద్యాం పరిపూర్ణ మేరుశిఖరే బిందుత్రికోణేస్థితాం

వాగీశాది సమస్త భూతజననీం మంచే శివాకారకే

కామాక్షీం కరుణా రసార్ణవమయీం కామేశ్వరాంకస్థితాం

కాంతాం చిన్మయ కామకోటినిలయాం శ్రీ బ్రహ్మవిద్యాం భజే ||1||

 

లమిత్యాది పంచపూజాం కుర్యాత్

లం పృథ్వీతత్త్వాత్మికాయై శ్రీలలితాదేవ్యె గంధం సమర్పయామి

హం ఆకాశతత్త్వాత్మికాయై శ్రీలలితాదేవ్యె పుష్పం సమర్పయామి

యం వాయుతత్త్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యె ధూపం సమర్పయామి

రం వహ్నితత్త్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యై దీపం సమర్పయామి

వం అమృతతత్త్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యై అమృతనైవేద్యం సమర్పయామి

 

పంచపూజాం కృత్వా యోగిముద్రాం ప్రదర్శ్య

 

అథ కవచం

కకారః పాతు శీర్షం మే ఏకారః పాతు ఫాలకమ్|

ఈకారశ్చక్షుషీ పాతు శ్రోత్రే రక్షేల్లకారకః ||2||

 

హ్రీంకారః పాతు నాసాగ్రం వక్త్రం వాగ్భవ సంజ్ఞికః|

హకారః పాతు కంఠం మే సకారః స్కంధదేశకం ||3||

 

కకారో హృదయం పాతు హకారో జఠరం తథా|

లకారో నాభిదేశం తు హ్రీంకారః పాతు గుహ్యకం ||4||

 

కామకూటః సదా పాతు కటిదేశం మమావతు|

సకారః పాతుచోరూమే కకారః పాతు జానునీ ||5||

 

లకారః పాతు జంఘేమే హ్రీంకారః పాతుగుల్ఫకౌ|

శక్తికూటం సదా పాతు పాదౌ రక్షతు సర్వదా ||6||

 

మూలమంత్రకృతం చైతత్కవచం యో జపేన్నరః|

ప్రత్యహం నియతః ప్రాతస్తస్య లోకావశంవదాః ||7||