02 January 2025

Sri Hariharaputra Ayyappa Sahasranama Stotram | శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప సహస్రనామ స్తోత్రం

Sri Hariharaputra Ayyappa Sahasranama Stotram | శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప సహస్రనామ స్తోత్రం

 

అస్య శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప సహస్రనామ స్తోత్రమాలా మంత్రస్య అర్ధనారీశ్వర ఋషిః, అనుష్టుప్ఛందః, శ్రీ హరిహరపుత్రో దేవతా, హ్రాం బీజం, హ్రీం శక్తిః, హ్రూం కీలకం, శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప ప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః||

 

న్యాసః-

హ్రాం అంగుష్ఠాభ్యాం నమః|

హ్రీం తర్జనీభ్యాం నమః|

హ్రూం మధ్యమాభ్యాం నమః|

హైం అనామికాభ్యాం నమః|

హౌం కనిష్ఠికాభ్యాం నమః|

హ్రః కరతలకరపృష్ఠాభ్యాం నమః||

ఏవం హృదయాదిన్యాసః||

 

ధ్యానం:-

ధ్యాయేదుమాపతిరమాపతిభాగ్యపుత్రం

వేత్రోజ్జ్వలత్కరతలం భసితాభిరామమ్|

విశ్వెకవశ్యవపుషం మృగయావినోదం

వాంఛానురూపఫలదం వరభూతనాథమ్||1||

 

ఆశ్యామకోమలవిశాలతనుం విచిత్ర-

-వాసోవసానమరుణోత్పల వామహస్తమ్|

ఉత్తుంగరత్నమకుటం కుటిలాగ్రకేశం

శాస్తారమిష్టవరదం శరణం ప్రపద్యే||2||

 

స్తోత్రం:-

శివపుత్రో మహాతేజాః శివకార్యధురంధరః|

శివప్రదః శివజ్ఞానీ శైవధర్మసురక్షకః||1||

 

శంఖధారీ సురాధ్యక్షశ్చంద్రమౌలిః సురోత్తమః|

కామేశః కామతేజస్వీ కామాదిఫలసంయుతః||2||

 

కల్యాణః కోమలాంగశ్చ కల్యాణఫలదాయకః|

కరుణాబ్ధిః కర్మదక్షః కరుణారససాగరః||3||

 

జగత్రియో జగద్రక్షో జగదానందదాయకః|

జయాదిశక్తిసంసేవ్యో జనాహ్లాదో జిగీషుకః||4||

 

జితేంద్రియో జితక్రోధో జితదేవారిసంఘకః|

జైమిన్యాదృషిసంసేవ్యో జరామరణనాశకః||5||

 

జనార్ధనసుతో జ్యేష్ణో జ్యేష్ఠాదిగణసేవితః|

జన్మహీనో జితామిత్రో జనకేనాభిపూజితః||6||

 

పరమేష్ఠీ పశుపతిః పంకజాసనపూజితః|

పురహంతా పురత్రాతా పరమైశ్వర్యదాయకః||7||

 

పవనాదిసురైః సేవ్యః పంచబ్రహ్మపరాయణః|

పార్వతీతనయో బ్రహ్మ పరానందః పరాత్పరః||8||

 

బ్రహ్మిష్తో జ్ఞాననిరతో గుణాగుణనిరూపకః|

గుణాధ్యక్షో గుణనిధిః గోపాలేనాభిపుజితః||9||

 

గోరక్షకో గోధనదో గజారూడో గజప్రియః|

గజగ్రీవో గజస్కంధో గభస్తిర్గోపతిః ప్రభుః||10||

 

గ్రామపాలో గజాధ్యక్షో దిగ్గజేనాభిపూజితః|

గణాధ్యక్షో గణపతిర్గవాం పతిరహర్పతిః||11||

 

జటాధరో జలనిభో జైమిన్యైరభిపూజితః|

జలంధరనిహంతా చ శోణాక్షః శోణవాసకః||12||

 

సురాధిపః శోకహంతా శోభాక్షః సూర్యతేజసః|

సురార్చితః సురైర్వంద్యః శోణాంగః శాల్మలీపతిః||13||

 

సుజ్యోతిః శరవీరఘ్నః శరచ్చంద్రనిభాననః|

సనకాదిమునిధ్యేయః సర్వజ్ఞానప్రదో విభుః||14||

 

హలాయుధో హంసనిభో హాహాహూహూముఖస్తుతః|

హరిర్హరప్రియో హంసో హర్యక్షాసనతత్పరః||15||

 

పావనః పావకనిభో భక్తపాపవినాశనః|

భసితాంగో భయత్రాతా భానుమాన్ భయనాశనః||16||

 

త్రిపుండ్రకస్త్రినయనస్త్రిపుండ్రాంకితమస్తకః|

త్రిపురఘ్నో దేవవరో దేవారికులనాశకః||17||

 

దేవసేనాధిపస్తేజస్తేజోరాశిర్దశాననః|

దారుణో దోషహంతా చ దోర్దండో దండనాయకః||18||

 

ధనుష్పాణిర్ధరాధ్యక్షో ధనికో ధర్మవత్సలః|

ధర్మజ్ఞో ధర్మనిరతో ధనుః శాస్త్రపరాయణః||19||

 

స్థూలకర్ణః స్థూలతనుః స్థూలాక్షః స్థూలబాహుకః|

తనూత్తమస్తనుత్రాణస్తారకస్తేజసాం పతిః||20||

 

యోగీశ్వరో యోగనిధిర్యోగీశో యోగసంస్థితః|

మందారవాటికామత్తో మలయాచలవాసభూః||21||

 

మందారకుసుమప్రఖ్యో మందమారుతసేవితః|

మహాభాసో మహావక్షా మనోహరమదార్చితః||22||

 

మహోన్నతో మహాకాయో మహానేత్రో మహాహనుః|

మరుత్పూజ్యో మానధనో మోహనో మోక్షదాయకః||23||

 

మిత్రో మేధా మహౌజస్వీ మహావర్షప్రదాయకః|

భాషకో భాష్యశాస్త్రజ్ఞో భానుమాన్ భానుతేజసః||24||

 

భిషగ్భవానిపుత్రశ్చ భవతారణకారణః|

నీలాంబరో నీలనిభో నీలగ్రీవో నిరంజనః||25||

 

నేత్రత్రయో నిషాదజ్ఞో నానారత్నోపశోభితః|

రత్నప్రభో రమాపుత్రో రమయా పరితోషితః||26||

 

రాజసేవ్యో రాజధనః రణదోర్దండమండితః|

రమణో రేణుకాసేవ్యో రజనీచరదారణః||27||

 

ఈశాన ఇభరాట్సేవ్య ఈషణాత్రయనాశనః|

ఇడావాసో హేమనిభో హైమప్రాకారశోభితః||28||

 

హయప్రియో హయగ్రీవో హంసో హరిహరాత్మజః|

హాటకస్ఫటికప్రఖ్యో హంసారూధేన సేవితః||29||

 

వనవాసో వనాధ్యక్షో వామదేవో వరాననః|

వైవస్వతపతిర్విష్ణుః విరాడ్రూపో విశాం పతిః||30||

 

వేణునాదో వరగ్రీవో వరాభయకరాన్వితః|

వర్చస్వీ విపులగ్రీవో విపులాక్షో వినోదవాన్||31||

 

వైణవారణ్యవాసశ్చ వామదేవేనసేవితః|

వేత్రహస్తో వేదనిధిర్వంశదేవో వరాంగకః||32||

 

హ్రీంకారో హ్రీంమనా హృష్టో హిరణ్యో హేమసంభవః|

హుతాశో హుతనిష్పన్నో హుంకారాకృతి సుప్రభః||33||

 

హవ్యవాహో హవ్యకరశ్చాట్టహాసోఽపరాహతః|

అణురూపో రూపకరశ్చాజరోఽతనురూపకః||34||

 

హంసమంత్రశ్చ హుతభుక్ హేమాంబరః సులక్షణః|

నీపప్రియో నీలవాసాః నిధిపాలో నిరాతపః||35||

 

క్రోడహస్తస్తపస్త్రాతా తపోరక్షస్తపాహ్వయః|

మూర్ధాభిషిక్తో మానీ చ మంత్రరూపో మృడో మనుః||36||

 

మేధావీ మేధసో ముష్ణుః మకరో మకరాలయః|

మార్తాండో మంజుకేశశ్చ మాసపాలో మహౌషధిః||37||

 

శ్రోత్రియః శోభమానశ్చ సవితా సర్వదేశికః|

చంద్రహాసః శమః శక్తః శశిభాసః శమాధికః||38||

 

సుదంతః సుకపోలశ్చ షడ్వర్ణః సంపదోఽధిపః|

గరళః కాలకంఠశ్చ గోనేతా గోముఖప్రభుః||39||

 

కౌశికః కాలదేవశ్చ క్రోశకః క్రౌంచభేదకః|

క్రియాకరః కృపాలుశ్చ కరవీరకరేరుహః||40||

 

కందర్పదర్పహారీ చ కామదాతా కపాలకః|

కైలాసవాసో వరదో విరోచనో విభావసుః||41||

 

బభ్రువాహో బలాధ్యక్షః ఫణామణివిభూషణః|

సుందరః సుముఖః స్వచ్ఛః సభాసశ్చ సభాకరః||42||

శరానివృత్తః శక్రాప్తః శరణాగతపాలకః|

తీక్ష దంష్ట్రా దీర్ఘజిహ్వః పింగళాక్షః పిశాచహా||43||

 

అభేద్యశ్చాంగదార్థ్యశ్చ భోజపాలోఽథ భూపతిః|

గృధ్రనాసోఽవిషహ్యశ్చ దిగ్దేహో దైన్యదాహకః||44||

 

బడబాపూరితముఖో వ్యాపకో విషమోచకః|

హసంతః సమరక్రుద్ధః పుంగవః పంకజాసనః||45||

 

విశ్వదర్పో నిశ్చితాజ్ఞో నాగాభరణభూషితః|

భరతో భైరవాకారో భరణో వామనక్రియః||46||

 

సింహాస్యః సింహరూపశ్చ సేనాపతిః సకారకః|

సనాతనః సిద్ధరూపీ సిద్ధధర్మపరాయణః||47||

 

ఆదిత్యరూపశ్చాపద్నశ్చామృతాబ్ధినివాసభూః|

యువరాజో యోగివర్య ఉషస్తేజా ఉడుప్రభః||48||

 

దేవాదిదేవో దైవజ్ఞస్తామ్రోష్ఠస్తామ్రలోచనః|

పింగళాక్షః పింఛచూడః ఫణామణివిభూషితః||49||

 

భుజంగభూషణో భోగో భోగానందకరోఽవ్యయః|

పంచహస్తేన సంపూజ్యః పంచబాణేన సేవితః||50||

 

భవః శర్వో భానుమయః ప్రాజాపత్యస్వరూపకః|

స్వచ్ఛందశ్ఛందఃశాస్త్రజ్ఞో దాంతో దేవమనుప్రభుః||51||

 

దశభుక్చ దశాధ్యక్షో దానవానాం వినాశనః|

సహస్రాక్షః శరోత్పన్నః శతానందసమాగమః||52||

 

గృధ్రాద్రివాసో గంభీరో గంధగ్రాహో గణేశ్వరః|

గోమేధో గండకావాసో గోకులైః పరివారితః||53||

 

పరివేషః పదజ్ఞానీ ప్రియంగుద్రుమవాసకః|

గుహావాసో గురువరో వందనీయో వదాన్యకః||54||

 

వృత్తాకారో వేణుపాణిర్వీణాదండధరో హరః|

హైమీడ్యో హోతృసుభగో హౌత్రజ్ఞశ్చౌజసాం పతిః||55||

 

పవమానః ప్రజాతంతుప్రదో దండవినాశనః|

నిమీడ్యో నిమిషార్ధజ్ఞో నిమిషాకారకారణః||56||

 

లిగుడాభో లిడాకారో లక్ష్మీవంద్యో వరప్రభుః|

ఇడాజ్ఞః పింగళావాసః సుషుమ్నామధ్యసంభవః||57||

 

భిక్షాటనో భీమవర్చా వరకీర్తిః సభేశ్వరః|

వాచాతీతో వరనిధిః పరివేత్తా ప్రమాణకః||58||

 

అప్రమేయోఽనిరుద్ధశ్చాప్యనంతాదిత్యసుప్రభః|

వేషప్రియో విషగ్రాహో వరదానకరోత్తమః||59||

 

విపినో వేదసారశ్చ వేదాంతైః పరితోషితః|

వక్రాగమో వర్చవచా బలదాతా విమానవాన్||60||

 

వజ్రకాంతో వంశకరో వటురక్షావిశారదః|

వప్రక్రీడో విప్రపూజ్యో వేలారాశిశ్చలాలకః||61||

 

కోలాహలః క్రోడనేత్రః క్రోడాస్యశ్చ కపాలభృత్|

కుంజరేడ్యో మంజువాసాః క్రియమాణః క్రియాప్రదః||62||

 

క్రీడానాథః కీలహస్తః క్రోశమానో బలాధికః|

కనకో హోతృభాగీ చ ఖవాసః ఖచరః ఖగః||63||

 

గణకో గుణనిర్దుష్టో గుణత్యాగీ కుశాధిపః|

పాటలః పత్రధారీ చ పలాశః పుత్రవర్ధనః||64||

 

పితృసచ్చరితః ప్రేష్ఠః పాపభస్మా పునః శుచిః|

ఫాలనేత్రః ఫుల్లకేశః ఫుల్లకల్హారభూషితః||65||

 

ఫణిసేవ్యః పట్టభద్రః పటుర్వాగ్మీ వయోఽధికః|

చోరనాట్యశ్చోరవేషశ్చోరఘ్నశ్చౌర్యవర్ధనః||66||

 

చంచలాక్షశ్చామరకో మరీచిర్మదగామికః|

మృడాభో మేషవాహశ్చ మైథిల్యో మోచకో మనుః||67||

 

మనురూపో మంత్రదేవో మంత్రరాశిర్మహాదృఢః|

స్థూపిజ్ఞో ధనదాతా చ దేవవంద్యశ్చ తారణః||68||

 

యజ్ఞప్రియో యమాధ్యక్ష ఇభక్రీడ ఇభేక్షణః|

దధిప్రియో దురాధర్ష్ దారుపాలో దనూజహా||69||

 

దామోదరో దామధరో దక్షిణామూర్తిరూపకః|

శచీపూజ్యః శంఖకర్ణశ్చంద్రచూడో మనుప్రియః||70||

 

గుడరూపో గుడాకేశః కులధర్మపరాయణః|

కాలకంఠో గాఢగాత్రో గోత్రరూపః కులేశ్వరః||71||

 

ఆనందభైరవారాధ్యో హయమేధఫలప్రదః|

దధ్యన్నాసక్తహృదయో గుడాన్నప్రీతమానసః||72||

 

ఘృతాన్నాసక్తహృదయో గౌరాంగో గర్వభంజకః|

గణేశపూజ్యో గగనః గణానాం పతిరూర్జితః||73||

 

ఛద్మహీనః శశిరదః శత్రూణాం పతిరంగిరాః|

చరాచరమయః శాంతః శరభేశః శతాతపః||74||

 

వీరారాధ్యో వక్రగమో వేదాంగో వేదపారగః|

పర్వతారోహణః పూషా పరమేశః ప్రజాపతిః||75||

 

భావజ్ఞో భవరోగఘ్నో భవసాగరతారణః|

చిదగ్నిదేహశ్చిద్రూపశ్చిదానందశ్చిదాకృతిః||76||

 

నాట్యప్రియో నరపతిర్నరనారాయణార్చితః|

నిషాదరాజో నీహారో నేష్టా నిష్ఠురభాషణః||77||

 

నిమ్నప్రియో నీలనేత్రో నీలాంగో నీలకేశకః|

సింహాక్షః సర్వవిఘ్నేశః సామవేదపరాయణః||78||

 

సనకాదిమునిధ్యేయః శర్వరీశః షడాననః|

సురూపః సులభః స్వర్గః శచీనాథేన పూజితః||79||

 

కాకినః కామదహనో దగ్ధపాపో ధరాధిపః|

దామగ్రంథీ శతస్త్రీశస్తంత్రీపాలశ్చ తారకః||80||

 

తామ్రాక్షస్తీక్ష దంష్ట్రశ్చ తిలభోజ్యస్తిలోదరః|

మాండుకర్ణో మృడాధీశో మేరువర్డ్లో మహోదరః||81||

 

మార్తాండభైరవారాధ్యో మణిరూపో మరుద్వహః|

మాషప్రియో మధుపానో మృణాలో మోహినీపతిః||82||

 

మహాకామేశతనయో మాధవో మదగర్వితః|

మూలాధారాంబుజావాసో మూలవిద్యాస్వరూపకః||83||

 

స్వాధిష్ఠానమయః స్వస్థః స్వస్తివాక్యః స్రువాయుధః|

మణిపూరాబ్జనిలయో మహాభైరవపూజితః||84||

 

అనాహతాబ్జరసికో హ్రీంకారరసపేశలః|

భ్రూమధ్యవాసో భ్రూకాంతో భరద్వాజప్రపూజితః||85||

 

సహస్రారాంబుజావాసః సవితా సామవాచకః|

ముకుందశ్చ గుణాతీతో గుణపూజ్యో గుణాశ్రయః||86||

 

ధన్యశ్చ ధనభృద్ధాహో ధనదానకరాంబుజః|

మహాశయో మహాతీతో మాయాహీనో మదార్చితః||87||

 

మాఠరో మోక్షఫలదః సద్వెరికులనాశనః|

పింగళః పింఛచూడశ్చ పిశితాశపవిత్రకః||88||

 

పాయసాన్నప్రియః పర్వపక్షమాసవిభాజకః|

వజ్రభూషో వజ్రకాయో విరించో వరవక్షణః||89||

 

విజ్ఞానకలికాబృందో విశ్వరూపప్రదర్శకః|

డంభఘ్నో దమఘోషఘ్నో దాసపాలస్తపౌజసః||90||

 

ద్రోణకుంభాభిషిక్తశ్చ ద్రోహినాశస్తపాతురః|

మహావీరేంద్రవరదో మహాసంసారనాశనః||91||

 

లాకినీహాకినీలబ్ధి లవణాంభోధితారణః|

కాకిలః కాలపాశఘ్నః కర్మబంధవిమోచకః||92||

 

మోచకో మోహనిర్భిన్నో భగారాధ్యో బృహత్తనుః|

అక్షయోఽక్రూరవరదో వక్రాగమవినాశనః||93||

 

డాకినః సూర్యతేజస్వీ సర్పభూషశ్చ సద్గురుః|

స్వతంత్రః సర్వతంత్రేశో దక్షిణాదిగధీశ్వరః||94||

 

సచ్చిదానందకలికః ప్రేమరూపః ప్రియంకరః|

మిథ్యాజగదధిష్ఠానో ముక్తిదో ముక్తిరూపకః||95||

 

ముముక్షుః కర్మఫలదో మార్గదక్షోఽథ కర్మఠః|

మహాబుద్ధో మహాశుద్ధః శుకవర్ణః శుకప్రియః||96||

 

సోమప్రియః స్వరప్రీతః పర్వారాధనతత్పరః|

అజపో జనహంసశ్చ హలపాణిప్రపూజితః||97||

 

అర్చితో వర్ధనో వాగ్మీ వీరవేషో విధుప్రియః|

లాస్యప్రియో లయకరో లాభాలాభవివర్జితః||98||

 

పంచాననః పంచగూఢః పంచయజ్ఞఫలప్రదః|

పాశహస్తః పావకేశః పర్జన్యసమగర్జనః||99||

 

పాపారిః పరమోదారః ప్రజేశః పంకనాశనః|

నష్టకర్మా నష్టవైర ఇష్టసిద్ధిప్రదాయకః||100||

 

నాగాధీశో నష్టపాప ఇష్టనామవిధాయకః|

సామరస్యశ్చాప్రమేయః పాషండీ పర్వతప్రియః||101||

 

పంచకృత్యపరః పాతా పంచపంచాతీశాయికః|

పద్మాక్షః పద్మవదనః పావకాభః ప్రియంకరః||102||

 

కార్తస్వరాంగో గౌరాంగో గౌరీపుత్రో ధనేశ్వరః|

గణేశాక్లిష్టదేహశ్చ శీతాంశుః శుభదీధితిః||103||

 

దక్షధ్వంసో దక్షకరో వరః కాత్యాయనీసుతః|

సుముఖో మార్గణో గర్భో గర్వభంగః కుశాసనః||104||

 

కులపాలపతిః శ్రేష్తో పవమానః ప్రజాధిపః|

దర్శప్రియో నిర్వికారో దీర్ఘకాయో దివాకరః||105||

 

భేరీనాదప్రియో బృందో బృహత్సేనః సుపాలకః|

సుబ్రహ్మా బ్రహ్మరసికో రసజ్ఞో రజతాద్రిభాః||106||

 

తిమిరఘ్నో మిహిరాభో మహానీలసమప్రభః|

శ్రీచందనవిలిప్తాంగః శ్రీపుత్రః శ్రీతరుప్రియః||107||

 

లాక్షావర్డ్లో లసత్కర్ణో రజనీధ్వంసిసన్నిభః|

బిందుప్రియోఽంబికాపుత్రో బైందవో బలనాయకః||108||

 

ఆపన్నతారకస్తప్తస్తప్తకృచ్ఛఫలప్రదః|

మరుద్వృధో మహాఖర్వశ్చీరవాసాః శిఖిప్రియః||109||

 

ఆయుష్మాననఘో దూత ఆయుర్వేదపరాయణః|

హంసః పరమహంసశ్చాప్యవధూతాశ్రమప్రియః||110||

 

ఆశువేగోఽశ్వహృదయో హయధైర్యఫలప్రదః|

సుముఖో దుర్ముఖోఽవిఘ్నో నిర్విఘ్నో విఘ్ననాశనః||111||

 

ఆర్యో నాథోఽర్యమాభాసః ఫల్గుణః ఫాలలోచనః|

అరాతిఘ్నో ఘనగ్రీవో గ్రీష్మసూర్యసమప్రభః||112||

 

కిరీటీ కల్పశాస్త్రజ్ఞః కల్పానలవిధాయకః|

జ్ఞానవిజ్ఞానఫలదో విరించారివినాశనః||113||

 

వీరమార్తాండవరదో వీరబాహుశ్చ పూర్వజః|

వీరసింహాసనో విజ్ఞో వీరకార్యోఽస్తదానవః||114||

 

నరవీరసుహృద్భాతా నాగరత్నవిభూషితః|

వాచస్పతిః పురారాతిః సంవర్తః సమరేశ్వరః||115||

 

ఉరువాగ్మీ హ్యుమాపుత్ర ఉడులోకసురక్షకః|

శృంగారరససంపూర్ణః సిందూరతిలకాంకితః||116||

 

కుంకుమాంకితసర్వాంగః కాలకేయవినాశనః|

మత్తనాగప్రియో నేతా నాగగంధర్వపూజితః||117||

 

సుస్వప్నబోధకో బోధో గౌరీదుఃస్వప్ననాశనః|

చింతారాశిపరిధ్వంసీ చింతామణివిభూషితః||118||

 

చరాచరజగత్ప్రష్టా చలత్కుండలకర్ణయుక్|

ముకురాస్యో మూలనిధిర్నిధిద్వయనిషేవితః||119||

 

నీరాజనప్రీతమనాః నీలనేత్రో నయప్రదః|

కేదారేశః కిరాతశ్చ కాలాత్మా కల్పవిగ్రహః||120||

 

కల్పాంతభైరవారాధ్యః కాకపత్రశరాయుధః|

కలాకాష్ఠాస్వరూపశ్చ ఋతువర్షాదిమాసవాన్||121||

 

దినేశమండలావాసో వాసవాదిప్రపూజితః|

బహులస్తంబకర్మజ్ఞః పంచాశద్వర్ణరూపకః||122||

 

చింతాహీనశ్చిదాక్రాంతః చారుపాలో హలాయుధః|

బంధూకకుసుమప్రఖ్యః పరగర్వవిభంజనః||123||

 

విద్వత్తమో విరాధఘ్నః సచిత్రశ్చిత్రకర్మకః|

సంగీతలోలుపమనాః స్నిగ్ధగంభీరగర్జితః||124||

 

తుంగవక్త్రః స్తవరసశ్చాభ్రాభో భ్రమరేక్షణః|

లీలాకమలహస్తాబ్జా బాలకుందవిభూషితః||125||

 

లోధ్రప్రసవశుద్ధాభః శిరీషకుసుమప్రియః|

త్రాసత్రాణకరస్తత్త్వం తత్త్వవాక్యార్థబోధకః||126||

 

వర్షీయాంశ్చ విధిస్తుత్యో వేదాంతప్రతిపాదకః|

మూలభూతో మూలతత్త్వం మూలకారణవిగ్రహః||127||

 

ఆదినాథోఽక్షయఫలపాణిర్జన్మాఽపరాజితః|

గానప్రియో గానలోలో మహేశో విజ్ఞమానసః||128||

 

గిరిజాస్తన్యరసికో గిరిరాజవరస్తుతః|

పీయూషకుంభహస్తాబ్జః పాశత్యాగీ చిరంతనః||129||

 

సుధాలాలసవక్తాబ్జః సురద్రుమఫలేప్సితః|

రత్నహాటకభూషాంగో రావణాదిప్రపూజితః||130||

 

కనత్కాలేశసుప్రీతః క్రౌంచగర్వవినాశనః|

అశేషజనసమ్మోహ ఆయుర్విద్యాఫలప్రదః||131||

 

అవబద్దదుకూలాంగో హారాలంకృతకంధరః|

కేతకీకుసుమప్రీతః కలభైః పరివారితః||132||

 

కేకాప్రియః కార్తికేయః సారంగనినదప్రియః|

చాతకాలాపసంతుష్టశ్చమరీమృగసేవితః||133||

 

ఆమ్రకూటాద్రిసంచారీ చామ్నాయఫలదాయకః|

ధృతాక్షసూత్రపాణిశ్చాప్యక్షిరోగవినాశనః||134||

 

ముకుందపూజ్యో మోహాంగో మునిమానసతోషితః| తైలాభిషిక్తసుశిరాస్తర్జనీముద్రికాయుతః||135||

 

తటాతకామనః ప్రీతస్తమోగుణవినాశనః|

అనామయోఽప్యనాదర్శశ్చార్జునాభో హుతప్రియః||136||

 

షాడ్గుణ్యపరిసంపూర్ణః సప్తాశ్వాదిగ్రహైః స్తుతః|

వీతశోకః ప్రసాదజ్ఞః సప్తప్రాణవరప్రదః||137||

 

సప్తార్చిశ్చ త్రినయనస్త్రివేణీఫలదాయకః|

కృష్ణవర్త్మా వేదముఖో దారుమండలమధ్యగః||138||

 

వీరనూపురపాదాజ్జో వీరకంకణపాణిమాన్|

విశ్వమూర్తిః శుద్ధముఖః శుద్ధభస్మానులేపనః||139||

 

శుంభధ్వంసినీసంపూజ్యో రక్తబీజకులాంతకః|

నిషాదాదిస్వరప్రీతః నమస్కారఫలప్రదః||140||

 

భక్తారిపంచతాదాయీ సజ్జీకృతశరాయుధః|

అభయంకరమంత్రజ్ఞః కుబ్జకామంత్రవిగ్రహః||141||

 

ధూమ్రాస్త్రశ్చోగ్రతేజస్వీ దశకంఠవినాశనః|

ఆశుగాయుధహస్తాట్టో గదాయుధకరాంబుజః||142||

 

పాశాయుధసుపాణిశ్చ కపాలాయుధసద్భుజః|

సహస్రశీర్షవదనః సహస్రద్వయలోచనః||143||

 

నానాహేతిర్ధనుష్పాణిః నానాస్రగ్భూషణప్రియః|

ఆశ్యామకోమలతనురారక్తాపాంగలోచనః||144||

 

ద్వాదశాహక్రతుప్రీతః పౌండరీకఫలప్రదః|

ఆప్తోర్యామక్రతుమయశ్చయనాదిఫలప్రదః||145||

 

పశుబంధస్యఫలదో వాజపేయాత్మదైవతః|

ఆబ్రహ్మకీటజననావనాత్మా చంపకప్రియః||146||

 

పశుపాశవిభాగజ్ఞః పరిజ్ఞానప్రదాయకః|

కల్పేశ్వరః కల్పవర్యో జాతవేదా ప్రభాకరః||147||

 

కుంభీశ్వరః కుంభపాణిః కుంకుమాక్తలలాటకః|

శిలీధ్రపత్రసంకాశః సింహవక్త్రప్రమర్దనః||148||

 

కోకిలక్వణనాకర్ణీ కాలనాశనతత్పరః|

నైయ్యాయికమతఘ్నశ్చ బౌద్ధసంఘవినాశనః||149||

 

ధృతహేమాబ్జపాణిశ్చ హోమసంతుష్టమానసః|

పితృయజ్ఞస్యఫలదః పితృవజ్జనరక్షకః||150||

 

పదాతికర్మనిరతః పృషదాజ్యప్రదాయకః|

మహాసురవధోద్యుక్తః స్వాస్త్రప్రత్యస్త్రవర్షకః||151||

 

మహావర్షతిరోధానః నాగాధృతకరాంబుజః|

నమః స్వాహా వషట్ వౌషట్ పల్లవప్రతిపాదకః||152||

 

మహిరసదృశగ్రీవో మహిరసదృశస్తవః|

తంత్రీవాదనహస్తాగ్రః సంగీతప్రీతమానసః||153||

 

చిదంశముకురావాసో మణికూటాద్రిసంచరః|

లీలాసంచారతనుకో లింగశాస్త్రప్రవర్తకః||154||

 

రాకేందుద్యుతిసంపన్నో యాగకర్మఫలప్రదః|

మైనాకగిరిసంచారీ మధువంశవినాశనః|

తాలఖండపురావాసః తమాలనిభతైజసః||155||

 

||ఇతి శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప సహస్రనామ స్తోత్రం సమాప్తం||