Viswa Prardhana - విశ్వ ప్రార్ధన
ॐ
ఓ పూజ్య ప్రభూ! క్షమాపరిపూర్ణా ప్రేమ మయా! నీకు నమస్కృతులు.
సాష్టాంగ ప్రణామములు. నీవు సచ్చిదానందుడవు, సర్వాంతర్యామిని, సర్వశక్తిమయుడవు, సర్వజ్ఞుడవు సర్వజీవ హృదయాంతరవాసివి, కరుణార్ధ్ర హృదయము, సమదృష్టి, స్థిర మనస్సు, భక్తి విశ్వాసజ్ఞానములు మాకు ప్రసాదింపుము. ఆకర్షణలు అణగద్రొక్కి
చిత్తవృత్తుల నరికట్టుటకు మాకు వలయు అంతరిక ఆధ్యాత్మిక శక్తి నొసగుము. కామలోభ ద్వేషముల
బారి నుండి మమ్ము తప్పింపుము. మా హృదయ ఫలకములను సద్గుణములతో నింపి వేయుము. ఈ సర్వనామ
రూపములలో నిన్ను తిలకింపనిమ్ము. ఈ సర్వనామ రూపములలో నిన్ను సేవింపనిమ్ము. నిన్ను
సదా స్మరించుకొన నిమ్ము. నీ లీలలు గానము చేయ నిమ్ము. నీ నామము పెదవులపై
నుండనిమ్ము. నీలో సదా మమ్ము నివసింపనిమ్ము.