Labels

Breaking

దీపావళి రోజున దీపాలు వెలిగించవలసిన ఎనిమిది పవిత్ర స్థానాలు


దీపావళి రోజున దీపాలు వెలిగించవలసిన ఎనిమిది పవిత్ర స్థానాలు

 

లక్ష్మిదేవి సంపదకు, వైభవానికి, ఆనందానికి మూలం. ఆమె అడుగుపెట్టిన ఇంట్లో దారిద్ర్యం చేరదు.

దీపావళి రోజున లక్ష్మిదేవి భూమిని దర్శించడానికి వస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

అందుకే దీపావళి రోజు ఆమెకు స్వాగతం పలుకుతూ ఇంటిని శుభ్రపరిచి పూలతో, దీపాలతో అలంకరిస్తారు.

అమావాస్య - చీకటి రాత్రి కూడా ఆ వెలుగులతో ప్రకాశమానమవుతుంది.

 

దీపావళి అంటే చీకటిపై కాంతి విజయం సాధించడం.

లక్ష్మిదేవి మీ ఇంటిలో స్థిరంగా నివసించాలంటే, పూజ అనంతరం ఈ ఎనిమిది ప్రదేశాలలో దీపాలు వెలిగించాలి:

 

ఇంటి ప్రధాన ద్వారం వద్ద:

లక్ష్మిదేవి ఇంట్లోకి ప్రవేశించే ప్రధాన ద్వారం ఇది. పువ్వులతో అలంకరించి దీపం వెలిగించాలి.

 

ధాన్యాగారం (స్టోర్ హౌస్ లో):

ఆహార (బియ్యం, ధాన్యం, ఇతర ఆహార పదార్ధాలు) నిల్వ ఉంచే ప్రదేశం కాబట్టి ఇక్కడ దీపం వెలిగిస్తే ఆహార సమృద్ధి కలుగుతుంది.

 

డబ్బు ఉంచే స్థలంలో:

సంపద స్థిరంగా ఉండటానికి దీపావళి రాత్రి డబ్బులు ఉంచే  ప్రదేశంలో దీపం వెలిగించాలి.

 

వాహన సమీపంలో:

దీపం వెలిగించడం వల్ల ప్రమాదాలు దూరమవుతాయి. మీ ప్రయాణానికి వాహనానికి భద్రత కలుగుతుంది.

 

నీటి వనరుల వద్ద (బావి, కుళాయి, బోరు, మోటర్ మొదలైనవి):

జలతత్త్వం పవిత్రం. నీటి వనరుల వద్ద దీపం వెలిగించడం జీవన శక్తిని పెంచుతుంది.

 

గుడి లేదా పూజగది:

దేవతామూర్తుల అనుగ్రహం లభిస్తుంది, దివ్య శక్తి ఇంట్లో ప్రవహిస్తుంది.

 

తులసి చెట్టు వద్ద:

తులసి చెట్టు లక్ష్మీదేవి స్వరూపం. ఇక్కడ దీపం వెలిగించడం అత్యంత మంగళప్రదం. శుభప్రదం.

 

రావి చెట్టు వద్ద:

రావిచెట్టులో 33 వర్గాల దేవతలు నివసిస్తారని నమ్మకం. విష్ణువు స్వయంగా నివసించే చెట్టు కూడా రావి చెట్టు ఇది.

 

నరకాసురుడు ఎందుకు ఓడిపోయాడు?

 

దీపావళి నరకాసురుని వధకు చిహ్నం. కానీ అతని కథలో లోతైన జీవనబోధ కూడా దాగి ఉంది.

 

నరకాసురుడు విష్ణుమూర్తి (వరాహస్వామి) మరియు భూదేవి కుమారుడు.

అతను సంధ్యవేళలో పుట్టాడు అది జ్ఞానం (పగలు) మరియు అజ్ఞానం (రాత్రి) కలిసిన సమయం.

మంచి లక్షణాలు ఎన్ని ఉన్నా, ఒక్క చెడు లక్షణం చాలు జీవితం నాశనం అవుతుంది.

 

రావణుడు - జ్ఞాని అయినా అహంకారంతో నశించాడు.

మహిషాసురుడు - బలవంతుడు అయిన మదంతో నశించాడు,

నరకాసురుడు - కామం, మదం, క్రోధంతో నశించాడు.

 

భూదేవి తన కుమారుడిని చంపకూడదని కోరినా,

కానీ సత్యభామ రూపంలో తానే అతనిని సంహరించాల్సి వచ్చింది.

తన సద్గుణాలు నిలుపుకోకపోతే, దేవుని పుత్రుడైనా నశిస్తాడని ఈ కథ హిత బోధిస్తుంది.

 

చెడు స్నేహం నరకాసురుని అంతానికి మూలం.

బాణాసురుడి చెడు సాంగత్యంతో నరకాసురునిలో ఉన్న రాక్షస ప్రవృత్తి మేల్కొంది.

అతను మునులను అవమానించాడు, దేవతలను దూషించాడు, కామంతో రాజకుమార్తెలను చెరపట్టాడు.

అంతిమంగా సత్యభామ చేతిలో తన అంతం చూసాడు.

 

జీవన బోధ:

ప్రహ్లాదుడు - రాక్షసుని కడుపున పుట్టినా దేవుడిగా మారాడు.

నరకాసురుడు - దేవుని కడుపున పుట్టినా రాక్షసుడయ్యాడు.

 

మన గుణమే మన గమ్యం.

మన సాంగత్యమే మన శాపం లేదా ఆశీర్వాదం.

దీపావళి అంటే వెలుగు మాత్రమే కాదు అజ్ఞానంపై జ్ఞానం, చీకటిపై  వెలుగు విజయం సాధించడం.

 

లోకా సమస్తా సుఖినో భవంతు

శుభ దీపావళి! 

గణేశ స్తోత్రాలు

లక్ష్మీదేవి స్తోత్రాలు

శివ స్తోత్రాలు

విషుమూర్తి స్తోత్రాలు

వెంకటేశ్వర స్తోత్రాలు

అష్టోత్తర శతనామావళి

సహస్రనామావళి

పూజలు