Brihaspati (Guru Graha) Stotram – బృహస్పతి గురు గ్రహ స్తోత్రం
బృహస్పతిని గురు గ్రహ దోష నివారణకు "బృహస్పతిస్తోత్రం" చాలా ప్రభావవంతమైనది. ఇది స్కంధ పురాణం లోని ఈ స్తోత్రంలో గురువుని వివిధ నామాలతో స్తుతిస్తారు.
శ్రీ
గణేశాయ నమః |
అస్య
శ్రీబృహస్పతిస్తోత్రస్య గృత్సమద ఋషిః, అనుష్టుప్
ఛంధః,
బృహస్పతిర్దేవతా, బృహస్పతి ప్రీత్యర్థం జపే వినియోగః |
గురుర్బృహస్పతిర్జీవః
సురాచార్యో విదాంవరః |
వాగీశో
ధిషణో దీర్ఘశ్మశ్రుః పీతామ్బరో యువా || 1 ||
సుధాదృష్టిర్గ్రహాధీశో
గ్రహపీడాపహారకః |
దయాకరః
సౌమ్యమూర్తిః సురార్చ్యః కుంకుమద్యుతిః || 2 ||
లోకపూజ్యో
లోకగురుర్నీతిజ్ఞో నీతికారకః |
తారాపతిశ్చాఙ్గిరసో
వేదవైద్యపితామహః || 3 ||
భక్త్యా
బృహస్పతిం స్మృత్వా నామాన్యేతాని యః పఠేత్ |
అరోగీ
బలవాన్ శ్రీమాన్ పుత్రవాన్ స భవేన్నరః || 4 ||
జీవేద్వర్షశతం
మర్త్యో పాపం నశ్యతి నశ్యతి |
యః
పూజయేద్గురుదినే పీతగంధాక్ష తాంబరైః || 5 ||
పుష్పదీపోపహారైశ్చ
పూజయిత్వా బృహస్పతిమ్ |
బ్రాహ్మణాన్
భోజయిత్వా చ పీడా శాంతిర్భవేద్గురోః || 6 ||
|| ఇతి
శ్రీ స్కంద పురాణే బృహస్పతినామ స్తోత్రం సంపూర్ణం ||
బృహస్పతి
స్తోత్రాన్ని పఠించడం వలన కలిగే ప్రయోజనాలు:
గురువుని
అనుగ్రహం లభిస్తుంది.
ఆరోగ్యం
మెరుగుపడుతుంది.
బలం, ఐశ్వర్యం వృద్ధి చెందుతాయి.
సంతాన
ప్రాప్తి కలుగుతుంది.
ఆయుష్షు
పెరుగుతుంది.
గురు
గ్రహ దోష నివారణ జరుగుతుంది.
* ఈ
స్తోత్రాన్ని ప్రతిరోజూ లేదా ప్రతి గురువారం పఠించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి.