Vinayaka Chavithi Pooja Vidhanam – వినాయక చవితి పూజా విధానం
శ్రీ వరసిద్ది వినాయక
పూజకు కావలసిన వస్తువులు
పసుపు, కుంకుమ,
బియ్యం, బెల్లం, కొబ్బరికాయలు,
అరటిపళ్ళు, పంచామృతాలు (ఆవుపాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, కొబ్బరి నీళ్లు లేదా మంచి నీళ్లు), తమలపాకులు, వక్కలు, దీపపు
కుందులు, ఒత్తులు, హారతి కర్పూరం,
ఆవు నెయ్యి లేదా కొబ్బరి నూనె (ఆవు నెయ్యి శ్రేష్టం), అగరవత్తులు, గంధము, తోరము, 21 రకాల ఆకులు, పువ్వులు, పళ్ళు,
పిండివంటలు (ఉండ్రాళ్ళు, కుడుములు, పాయసం, పులిహోర, గారెలు
ఇంకా...)
పసుపు గణపతి (మట్టితో చేసిన గణపతి
మంచిది)
గణేష్ ప్రతిమ మట్టిది
మంచిదా? లేక రంగులది మంచిదా? అందుకు
పురాణంలో సమాధానం కలదు.
శ్లో: పార్థివిపూజితమామూర్తి
స్థైవావా పురుషాన్వా |
ఏకదడతి సా కామ్యం ధన పుత్రం పశునపీ||
స్త్రీ, పురుషులు
ఎవరైనా మట్టితో చేసిన గణపతి ప్రతిమను పూజించినచో ధన, పుత్ర,
పశ్వాది అన్ని సంపదలను పొందుదురు.
ప్రతిమకు ఏ మట్టి మంచిది.
"మృత్తికాంశం
సుందరం స్నిగ్ధామ్ సంచలనం పాషాణ వర్జితాం"
మట్టిలో ఎటువంటి మలినములు లేనిది, రాళ్ళూ, ఇతరత్రా కాగితములు లేనిది, శుభ్రం చేసిన మెత్తనిది, స్వచ్ఛమైన నీటితో ముద్దగా తడిపి ప్రతిమ చేయవలెను. ప్రతిమ స్వయంగా చేసుకోవడం మంచిదే. కానీ ఇది అందరికి సాధ్యం కాదు. కాబట్టి మీకు బయట మార్కెట్ లో మట్టి ప్రతిమను తీసుకొని పూజించుకోవాలి.
కలశం: రాగి
లేదా ఇత్తడి చెంబుకి పసుపు రాసి, అందులో గంధం, పుష్పాలు, అక్షతలు, నీళ్లు
వేసి, పైన టెంకాయ, జాకెట్టు ఉంచి కలశం
ఏర్పాటు చేసుకోవాలి.
ఒక పీటకు
పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి. పసుపు
రాసిన పీటపై ఒక పళ్లెంలో బియ్యం వేసి
వాటిపై తమలపాకులు వినాయక ప్రతిమను ఉంచి, పాలవెల్లికి
పసుపు రాసి, కుంకుమతో బొట్టులు పెట్టి ప్రతిమ తలపై వచ్చేలా
దాన్ని వేలాడదీయాలి. దానిపై పుష్పాలు పత్రి వేసి నలువైపులా మొక్కజొన్న పొత్తులు
ఇంకా పళ్లతో అలంకరించాలి.
తోరణం: ఒకటి, మూడు,
ఐదు, లేక తొమ్మిది ముడులతో తోరాన్ని తాయారు
చేసి, పూజలో ఉంచి దానిని మీరు మీ కుటుంబ సభ్యులు మొత్తం
పిల్లలతో సహా అందరూ ధరించవచ్చు.
ముందుగా
కుంకుమ బొట్టు పెట్టుకుని, నమస్కరించుకుని అగరుబత్తి, దీపారాధన తరువాత ఈ
క్రింది మంత్రాన్ని చెబుతూ పూజను ప్రాంభించాలి.
“ఓం దేవింవాచ మజనయంత దేవస్తాం
విశ్వరూపా: పశవో వదంతి
సానో మంద్రేష దుహనాథే నుర్వాగాస్మానుప సుష్ఠుతైత్తు అయం ముహూర్తస్సుముహూర్తోస్తు”
శ్లో:: "యశ్శివో
నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా తయో స్సంస్మరణా త్సుంసాం సర్వతో జయమంగళం" అని
చదవాలి.
పసుపు గణపతి పూజ:
ఎటువంటి పూజకైనా ముందుగా పసుపు గణపతికి పూజ చేయాలి.
పసుపుతో చేసిన గణపతికి కుంకుమ పెట్టి తమలపాకులో పెట్టాలి.
పీటపై ఈశాన్య దిక్కున కొద్దిగా బియ్యం వేసి దానిపై పసుపు గణపతిని తమలపాకుతో
పెట్టాలి. ఆవునెయ్యి లేదా కొబ్బరి నూనెతో దీపం వెలిగించి గణపతికి నమస్కరించి పసుపు
గణపతికి పూజ చేయాలి.
శ్రీ మహాగణాధిపతయే నమః
శ్రీ గురుభ్యో నమః
హరిః ఓం
శుచిః
(తలమీద నీళ్లు జల్లుకోండి)
అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోఽపి
వా
యః స్మరేత్ పుండరీకాక్షం స
బాహ్యాభ్యంతరః శుచిః ||
పుండరీకాక్ష పుండరీకాక్ష
పుండరీకాక్ష ||
(నమస్కారం చేస్తూ క్రింది
మంత్రాన్ని చదవండి)
శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం
చతుర్భుజం |
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ
విఘ్నోపశాంతయే ||
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం |
అనేక దంతం భక్తానాం ఏకదంత ముపాస్మహే
||
శ్రీ వక్రతుండ మహాకాయ కోటిసూర్య
సమప్రభ |
నిర్విఘ్నం కురు మే దేవ సర్వ
కార్యేషు సర్వదా ||
అయం ముహూర్తః సుముహూర్తోఽస్తు
శ్లో ॥ తదేవలగ్నం, సుదినం
తదేవ, తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ, లక్ష్మీపతేతేంఘ్ర
యుగంస్మరామి ||
శ్లో ॥ లాభస్తేషాం, జయస్తేషాం
కుతస్తేషాం పరాభవః
యేషా మిందీవర శ్యామో హృదయస్థో
జనార్దనః ||
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో
నమామ్యహం ||
సుమఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః,
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః
ధూమకేతు ర్గణాధ్యక్షః ఫాలచంద్రో
గజాననః,
వక్రతుండ శ్శూర్పకర్ణో, హేరంబః
స్కంధ పూర్వజః
అష్టావష్టా చ నామాని యః
పఠేచ్ఛృణుయాదపి
విద్యారంభే వివాహేచ ప్రవేశ నిర్గమే
తథా
సంగ్రామే సర్వకార్యేషు
విఘ్నస్తస్యనజాయతే
అభీప్సితార్థ సిద్ధర్థ్యం, పూజితో
యస్సురైరపి,
సర్వవిఘ్నచ్ఛిదేత స్మై గణాధిపతయే
నమః ||
ఆచమనం:
క్రింది మంత్రమును చేబుతూ 3
సార్లు నీటిని త్రాగవలెను.
ఓం కేశవాయ స్వాహా |
ఓం నారాయణాయ స్వాహా |
ఓం మాధవాయ స్వాహా |
నాలుగవ సారి నీళ్ళను క్రిందకు
వదలవలెను
నమస్కారము చేయుచు
ఈక్రింది మంత్రములను చెప్పవలెను.
ఓం గోవిందాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం మధుసూదనాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం వామనాయ నమః
ఓం శ్రీధరాయ నమః
ఓం హృషీకేశాయ నమః
ఓం పద్మనాభాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం సంకర్షణాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం ప్రద్యుమ్నాయ నమః
ఓం అనిరుద్ధాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం అధోక్షజాయ నమః
ఓం నారసింహాయ నమః
ఓం అచ్యుతాయ నమః
ఓం జనార్ధనాయ నమః
ఓం ఉపేంద్రాయ నమః
ఓం హరయే శ్రీకృష్ణాయ నమః
దీపారాధనం: (దీపం వెలిగించి, దానికి గంధం కుంకుమ బొట్టు పెట్టి క్రింది మంత్రాన్ని నమస్కారం చేస్తూ చెప్పండి.)
దీపస్త్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం
ప్రభురవ్యయః |
సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ
సర్వాన్కామాంశ్చ దేహి మే ||
భో దీప దేవి రూపస్త్వం కర్మ సాక్షీ
హ్యవిఘ్నకృత్ |
యావత్పూజాం కరిష్యామి తావత్వం
సుస్థిరో భవ ||
దీపారాధన ముహూర్తః సుముహూర్తోఽస్తు ||
పూజార్థే హరిద్రా కుంకుమ విలేపనం
కరిష్యే ||
భూతోచ్ఛాటనం:
(కొన్ని అక్షింతలు తీసుకుని
క్రింది మంత్రాన్ని చదువుతూ మీ వెనుకకు
వేసుకోండి)
|| ఓం ఉత్తిష్ఠంతు భూత
పిశాచాః య ఏతే భూమి భారకాః
ఏతేషా మ విరోధేన బ్రహ్మకర్మ సమారభే ||
ఓం భూర్భువస్సువః దైవీ గాయత్రీ ఛందః
ప్రాణాయామే వినియోగః
అపసర్పన్తు తే భూతా యే భూతా
భూమిసంస్థితాః |
యే భూతా విఘ్నకర్తారస్తే గచ్ఛంతు శివాఽజ్ఞయా
|
ప్రాణాయామం -
(కుడి చేతితో ముక్కు
మూసుకుని ఈ మంత్రం చెప్పవలెను)
ఓం భూః | ఓం
భువః | ఓం సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓం సత్యం |
ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య
ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ | ఓమాపో జ్యోతీ రసోమృతం
బ్రహ్మ భూర్భువస్సువరోమ్ |
ఓం లక్ష్మీనారాయణాభ్యాం నమః
శ్రీ ఉమా మహేశ్వరాభ్యం నమః
శ్రీ వాణిహిరణ్యగర్బాభ్యం నమః
శ్రీ సచీపురంధరాభ్యం నమః
శ్రీ అరుంధతీవశిష్టాభ్యం నమః
శ్రీ సీతారామాభ్యం నమః
సర్వేభ్యో దేవేభ్యో నమః, మాతృభ్యో
నమః, పితృభ్యో నమః
సంకల్పం:
(ఇక్కడ మీరు ముందుగా మీరు
నివశిస్తున్న దేశం పేరు, మీ దగ్గరలోని నదుల పేర్లు, మీరు ఉన్న దిక్కు, మీరు పూజ చేయు ప్రస్తుత సంవత్సరం,
మాసము, పక్షము, యోగము,
ఋతువు, వారం, తిధి,
నక్షత్రము మరియు మీ గోత్ర నామములు, పేర్లు
చూసుకోండి.)
ఓం మమ ఉపాత్త సమస్త దురితక్షయ
ద్వారా శ్రీ పరమేశ్వర పరమేశ్వరి ప్రీత్యర్ధం శుభాభ్యాం శుభే, శోభ్నే,
ముహూర్తే, శ్రీ మహావిష్ణో రాజ్ఞాయా
ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్థే, శ్వేత
వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీశైలశ్య ఈశాన్య
లేదా (మీరు ఉన్న దిక్కును చెప్పండి) ప్రదేశే కృష్ణ/గంగా/గోదావర్యోర్మద్యదేశే లేదా
(మీ ఊరికి ఉత్తర దక్షిణములలో ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన
వ్యావహారిక చంద్రమాన (ప్రస్తుత సంవత్సరం) సంవత్సరే (ఉత్తర/దక్షిణ/పశ్చిమ/ఈశాన్య)
ఆయనే (ప్రస్తుత ఋతువు) ఋతౌ (ప్రస్తుత మాసము) మాసే (ప్రస్తుత పక్షము) పక్షే (పూజ
చేస్తున్న రోజు తిథి) తిథౌ (పూజ చేస్తున్నరోజు వారము) వాసరే (పూజ చేస్తున్న రోజు
నక్షత్రము) శుభ నక్షత్రే (ప్రస్తుత యోగము) శుభయోగే, శుభకరణే.
ఏవం గుణ విశేషణ విషిష్ఠాయాం, శుభతిధౌ, శ్రీమాన్
(మీ గోత్రము) గోత్రస్య (మీ పూర్తి పేరు) నామధేయస్య, ధర్మపత్నీ
సమేతస్య (మిగతా కుటుంబ సభ్యుల పేర్లు చెప్పండి) అస్మాకం సహకుటుంబానాం క్షేమ,
స్థైర్య, ధైర్య, విజయ,
అభయ, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్యర్థం, ధర్మార్థ, కామమోక్ష చతుర్విధ ఫల, పురుషార్ధ సిద్ధ్యర్థం, ధన, కనక,
వస్తు వాహనాది సమృద్ధ్యర్థం, పుత్ర
పౌత్రాభివృద్ధ్యర్థం, సర్వాపదా నివారణార్ధం, సకల కార్యవిఘ్ననివారణార్ధం, సకల కార్యేషు సర్వదా
దిగ్విజయసిద్ధ్యర్ధం, సత్సంతాన సిధ్యర్ధం, పుత్రపుత్రికానాం సర్వతో ముఖాభివృద్యర్దం, ఇష్టకామ్యార్ధ
సిద్ధ్యర్థం, సర్వాభీష్ట స్థిత్యర్థం, శ్రీ
వరసిద్ధి వినాయక దేవతా ముద్దిశ్య శ్రీ వరసిద్ధి వినాయక దేవతపూజాం కరిష్యే అదౌ
నిర్విఘ్న పరిసమాప్త్యర్ధం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. (అంటూ మీ కుడిచేయి ఉంగరం వేలితో నీళ్లు ముట్టుకోవాలి.)
తదంగ కలశపూజాం కరిష్యే
కలశం గంధపుష్పాక్షతైరభ్యర్చ్య
తస్యోపరి హస్తం నిధాయ
కలశ పూజ: (కలశాన్ని తాకుతూ ఈ మంత్రాన్ని చదవాలి)
కలశస్య ముఖే విష్ణుః కంఠే
రుద్రస్సమాహితః |
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే
మాతృగణాస్మృతాః ||
కుక్షౌతు సాగరాః సర్వే సప్తద్వ్వీపా
వసుంధరా |
ఋగ్వేదోధ యజుర్వేద స్సామవేదో
హ్యధర్వణః ||
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు
సమాశ్రితాః
ఆయాంతు దేవపూజార్ధం దురితక్షయకారకాః
(మన దగ్గర ఉన్న మరొక
నీటిపాత్ర చుట్టూ గంధం రాసి బొట్లు పెట్టి అందులో తమలపాకు ఉంచాలి. ఈ శ్లోకం
చదువుతూ ఆకును నీటిలో సవ్య పద్దతిలో తిప్పాలి.
శ్లో: గంగేచ యమునేచైవ గోదావరి
సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్
సన్నిధిం కురు ||
తమలపాకుతో కొద్దిగ నీటిని మీ తలమీద
పూజాద్రవ్యముల మీద, దైవము మీద కొద్దిగా చిలకరించుకోవాలి.
పసుపు గణపతి పూజ
గణానాంత్వాం గణపతిగ్ం హవామహే,
కవిం కవీనా ముపమశ్రవస్తమం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం
బ్రహ్మణ్యస్పత్యః
ఆనశృణ్వన్నూతిభిస్సీద సాదనం ||
శ్రీ మహాగణాధిపతయే నమః ||
ధ్యానావాహనాది షోడశోపచార పూజాం
కరిష్యే
(ఉంగరం వేలితో నీటిని
తాకాలి)
ధ్యానం:
శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం
చతుర్భుజం |
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ
విఘ్నోపశాంతయే ||
ఉద్ధరిణలో ఉన్న నీటితో పసుపు గణపతిపై
చిన్నగా జల్లుతూ క్రింది విదంగా చదవాలి.
|| ధ్యాయామి ధ్యానం
సమర్పయామి ||
|| ఆవాహయామి ఆసనం సమర్పయామి ||
|| పాదయోః పాద్యం సమర్పయామి ||
|| హస్తయోః అర్ఘ్యం
సమర్పయామి ||
|| ముఖే శుద్ధ ఆచమనీయం
సమర్పయామి ||
పసుపు గణపతినకి పసుపు, కుంకుమ,
గంధం, పువ్వులు అక్షతలుతో, పూజించాలి. అగరువత్తులు
వెలిగించి, బెల్లం లేదా పండు నైవేద్యంగా పెట్టి షోడశోపచార పూజ చేయాలి.)
యధాభాగం గుడం నివేద యామి
పూజ చేసిన అక్షతలు కొన్ని తీసుకొని తలపై
వేసుకోవాలి.
|| శ్రీ మహాగణాధిపతి
స్సుప్రసన్నో, సుప్రీతో, వరదోభవతు
శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా
గృహ్లామి ||
పసుపు గణపతిని క్రింది విదంగా చెబుతూ
కొద్దిగా తూర్పువైపుకు కదిలించి
అక్షతలు వేసి నమస్కారం చేయాలి.
శ్రీ మహాగణాధిపతియే నమః యథాస్థానం
ప్రవేశయామి
శోభనార్థే క్షేమాయ పునరాగమనాయచ
పసుపు గణపతి పూజ అయిపోయింది.
శ్రీ వరసిద్ధి వినాయక పూజ
ప్రారంభః
ఆచమనం: మరల పైన
చెప్పిన విధంగా చేయాలి.
సంకల్పం: ఇది కూడా
పైన చెప్పిన విధంగా మరల చేయాలి.
కుడిచేతి మధ్య వేలితో నీటిని తాకుతూ
అథ శ్రీ వరసిద్ధి వినాయక పూజాం
కరిష్యే.
తదంగ ప్రాణ ప్రతిష్టాపనం కరిష్యే.
శ్రీ వరసిద్ధి వినాయక
ప్రాణప్రతిష్ఠ :
విగ్రహంపై పువ్వుతో కొంచెం పంచామృతాలను
చిలకరిస్తూ...
ఓం ఆం హ్రీం క్రోం యం రం లం వం శం
షం సం హం ఇత్యాద్యేన ప్రాణప్రతిష్ఠాపనం కృత్వా, నమస్కృత్వా
(నమస్కారం చేస్తూ)
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః
వినాయకుడి పాదాల వద్ద అక్షతలు లేక పూలు
వేస్తూ
శ్లో: ||
స్వామిన్ సర్వజగన్నాథ యావత్పూజావసానకం
తావత్వం ప్రీతిభావేన బింబేస్మిన్
సన్నిధిం కురు ||
అవాహితోభవ, స్థాపితోభవ,
సుప్రసన్నోభవ, అవకుంఠితోభవ, వరదోభవ, ప్రసీద, ప్రసీద,
ప్రసీద
శ్రీ వరసిద్ధి వినాయక ప్రాణ ప్రతిష్ఠా:
ఓం అసునీతే పునరస్మాసు చక్షుః పునఃప్రాణమిహ నో ధేహి భోగమ్ |
జ్యోక్పశ్యేమ సూర్యముచ్చరం తమనుమతే మృడయా నః స్స్వస్తి ||
అమృతం వై ప్రాణా అమృతమాపః ప్రాణానేవ యథాస్థానముపహ్వయతే |
ఇత్యాద్యేన ప్రాణప్రతిష్ఠాపనం కృత్వా, నమస్కృత్వా ||
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః |
స్వామిన్ సర్వజగన్నాథ యావత్పూజావసానకమ్ |
తావత్వం ప్రీతిభావేన బింబేఽస్మిన్ సన్నిధిం కురు ||
ఆవాహితో భవ, స్థాపితో భవ, సుముఖో భవ, సుప్రసన్నో భవ, వరదో భవ, ప్రసీద, ప్రసీద, ప్రసీద ||
ప్రార్థన:
వినాయకుడి విగ్రహం పాదాల వద్ద పూలు, అక్షతలు
వేసి నమస్కరిస్తూ
భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణమ్ |
విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం
భజే ||
ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం
చతుర్భుజమ్ |
పాశాంకుశధరం దేవం
ధ్యాయేత్సిద్ధివినాయకమ్ ||
ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం
శుభమ్ |
భక్తాభీష్టప్రదం తస్మాద్ధ్యాయేత్తం
విఘ్ననాయకమ్ ||
ధ్యానం:
వినాయకుడి విగ్రహం పాదాల వద్ద పూలు, అక్షతలు
వేసి నమస్కరిస్తూ
ధ్యాయేద్గజాననం దేవం
తప్తకాంచనసన్నిభమ్ |
చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితమ్ ||
ఓం శ్రీ వరసిద్ధివినాయక స్వామినే
నమః ధ్యాయామి |
ఆవాహనం: (పువ్వులు
లేక అక్షతలు వేస్తూ చెప్పండి)
అత్రాగచ్ఛ జగద్వంద్య
సురరాజార్చితేశ్వర |
అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భసముద్భవ ||
ఓం శ్రీ వరసిద్ధివినాయక స్వామినే
నమః ఆవాహయామి |
ఆసనం : (పువ్వులు
లేక అక్షతలు వేస్తూ చెప్పండి)
మౌక్తికైః పుష్పరాగైశ్చ
నానారత్నైర్విరాజితమ్ |
రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం
ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీ వరసిద్ధివినాయక స్వామినే
నమః ఆసనం సమర్పయామి |
అర్ఘ్యం: ఉద్ధరిణిలో
ఉన్న నీటిని స్వామికి చూపించి పక్కన ఉన్న పాత్రలో వేస్తూ చెప్పండి.
గౌరీపుత్ర నమస్తేఽస్తు
శంకరప్రియనందన |
గృహాణార్ఘ్యం మయా దత్తం
గంధపుష్పాక్షతైర్యుతమ్ ||
ఓం శ్రీ వరసిద్ధివినాయక స్వామినే
నమః అర్ఘ్యం సమర్పయామి |
పాద్యం: ఉద్ధరిణిలో
ఉన్న నీటిని స్వామికి చూపించి పక్కన ఉన్న పాత్రలో వేస్తూ చెప్పండి.
“గజవక్త్ర నమస్తేఽస్తు
సర్వాభీష్టప్రదాయక
భక్త్యా పాద్యం మయా దత్తం గృహాణ
ద్విరదానన”
ఓం శ్రీ వరసిద్ధివినాయక స్వామినే
నమః పాద్యం సమర్పయామి |
ఆచమనీయం: ఉద్ధరిణిలో
ఉన్న నీటిని స్వామికి చూపించి పక్కన ఉన్న పాత్రలో వేస్తూ చెప్పండి.
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణవరపూజిత |
గృహాణాచమనం దేవ తుభ్యం దత్తం మయా
ప్రభో ||
ఓం శ్రీ వరసిద్ధివినాయక స్వామినే
నమః ఆచమనీయం సమర్పయామి |
మధుపర్కం: (మధుపర్కం
చూపిస్తూ చెప్పండి)
దధిక్షీరసమాయుక్తం మధ్వాజ్యేన
సమన్వితమ్ |
మధుపర్కం గృహాణేదం గజవక్త్ర
నమోఽస్తు తే ||
ఓం శ్రీ వరసిద్ధివినాయక స్వామినే
నమః మధుపర్కం సమర్పయామి |
పంచామృత స్నానం: (ముందుగా
తయారు చేసిన పంచామృతాలు స్వామిపై జల్లుతూ చెప్పండి) (కొబ్బరికాయ
కొట్టి ఆ నీటిని స్వామిపై చల్లాలి.)
స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక |
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణగణపూజిత ||
ఓం శ్రీ వరసిద్ధివినాయక స్వామినే
నమః పంచామృత స్నానం సమర్పయామి |
శుద్ధోదక స్నానం: (కొద్దిగా
మంచి నీటిని స్వామిపై చల్లాలి)
గంగాదిసర్వతీర్థేభ్య
ఆహృతైరమలైర్జలైః |
స్నానం కురుష్య భగవన్నుమాపుత్ర
నమోఽస్తు తే ||
ఓం శ్రీ వరసిద్ధివినాయక స్వామినే
నమః శుద్ధోదక స్నానం సమర్పయామి |
స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి |
వస్త్రం: వస్త్రం
పెట్టండి లేదా పత్తికి పసుపు, కుంకుమ రాసి వస్త్రంగా చూపించండి.
రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యం చ
మంగళం |
శుభప్రద గృహాణ త్వం లంబోదర హరాత్మజ ||
ఓం శ్రీ వరసిద్ధివినాయక స్వామినే
నమః వస్త్రయుగ్మం సమర్పయామి |
యజ్ఞోపవీతం: (యజ్ఞోపవీతం
సమర్పించాలి)
రాజతం బ్రహ్మసూత్రం చ కాంచనం
చోత్తరీయకమ్ |
గృహాణ దేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక
||
ఓం శ్రీ వరసిద్ధివినాయక స్వామినే
నమః యజ్ఞోపవీతం సమర్పయామి |
గంధం: (కొద్దిగా
గంధాన్ని స్వామి పై చల్లాలి)
చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితమ్
|
విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం
ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీ వరసిద్ధివినాయక స్వామినే
నమః శ్రీగంధాన్ ధారయామి |
అక్షతలు: (అక్షతలు
చల్లాలి)
అక్షతాన్ ధవళాన్ దివ్యాన్
శాలీయాంస్తండులాన్ శుభాన్ |
గృహాణ పరమానంద శంభుపుత్ర నమోఽస్తు
తే ||
ఓం శ్రీ వరసిద్ధివినాయక స్వామినే
నమః అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి |
పుష్పాలు: (పూలతో
పూజించాలి)
సుగంధాని చ పుష్పాణి జాతీకుందముఖాని
చ |
ఏకవింశతిపత్రాణి సంగృహాణ నమోఽస్తు
తే ||
ఓం శ్రీ వరసిద్ధివినాయక స్వామినే
నమః పుష్పైః పూజయామి |
అథాంగపూజా:
ఓం గణేశాయ నమః - పాదౌ పూజయామి
ఓం ఏకదంతాయ నమః - గుల్ఫౌ పూజయామి
ఓం శూర్పకర్ణాయ నమః - జానునీ
పూజయామి
ఓం విఘ్నరాజాయ నమః - జంఘే పూజయామి
ఓం ఆఖువాహనాయ నమః - ఊరూం పూజయామి
ఓం హేరంబాయ నమః - కటిం పూజయామి
ఓం లంబోదరాయ నమః - ఉదరం పూజయామి
ఓం గణనాథాయ నమః - నాభిం పూజయామి
ఓం గణేశాయ నమః - హృదయం పూజయామి
ఓం స్థూలకంఠాయ నమః - కంఠం పూజయామి
ఓం స్కందాగ్రజాయ ణమహ శ్కంధౌ పూజయామి
ఓం పాశహస్తాయ ణమహ హస్థౌ పూజయామి
ఓం గజవక్త్రాయ నమః - వక్త్రం
పూజయామి
ఓం విఘ్నహంత్రే నమః - నేత్రం
పూజయామి
ఓం శూర్పకర్ణాయ నమః - కర్ణౌ పూజయామి
ఓం ఫాలచంద్రాయ నమః - లలాటం పూజయామి
ఓం సర్వేశ్వరాయ నమః - శిరః పూజయామి
ఓం విఘ్నరాజాయ నమః - సర్వాణ్యంగాణి
పూజయామి
అథ ఏకవింశతి పత్రపూజ:
(21 రకాల పత్రి)
సుముఖాయనమః - మాచీపత్రం పూజయామి
(దర్భ)
గణాధిపాయ నమః - బృహతీపత్రం పూజయామి
(వాకుడాకు)
ఉమాపుత్రాయ నమః - బిల్వపత్రం
పూజయామి (మారేడు)
గజాననాయ నమః - దుర్వాయుగ్మం
పూజయామి(గరిక)
హరసూనవేనమః - దత్తూరపత్రం పూజయామి
(ఉమ్మెత్త)
లంబోదరాయనమః - బదరీపత్రం పూజయామి
(రేగు)
గుహాగ్రజాయనమః - అపామార్గపత్రం
పూజయామి (ఉత్తరేణి)
గజకర్ణాయనమః - తులసీపత్రం పూజయామి
(తులసి)
ఏకదంతాయ నమః - చూతపత్రం పూజయామి
(ఆమ్ర)
వికటాయ నమః - కరవీరపత్రం పూజయామి
(గన్నేరు)
భిన్నదంతాయ నమః - విష్ణుక్రాంతపత్రం
పూజయామి
వటవేనమః - దాడిమీపత్రం పూజయామి
(దానిమ్మ)
సర్వేశ్వరాయనమః - దేవదారుపత్రం
పూజయామి
ఫాలచంద్రాయ నమః - మరువకపత్రం
పూజయామి
హేరంబాయనమః - సింధువారపత్రం పూజయామి
(వావిలి)
శూర్పకర్ణాయనమః - జాజీపత్రం పూజయామి
(జాజి)
సురాగ్రజాయనమః - గండకీపత్రం పూజయామి
ఇభవక్త్రాయనమః - శమీపత్రం పూజయామి
(జమ్మి)
వినాయకాయ నమః - అశ్వత్థపత్రం
పూజయామి (రావి)
సురసేవితాయ నమః - అర్జునపత్రం
పూజయామి (మద్ది)
కపిలాయ నమః - అర్కపత్రం పూజయామి
(జిల్లేడు)
శ్రీ గణేశ్వరాయ నమః - ఏకవింశతి పత్రాణి
పూజయామి
ఏకవింశతి పుష్ప పూజా: (21 రకాల పుష్పాలు)
ఓం పంచాస్య గణపతయే నమః - పున్నాగ
పుష్పం సమర్పయామి
ఓం మహా గణపతయే నమః - మందార పుష్పం
సమర్పయామి
ఓం ధీర గణపతయే నమః - దాడిమీ పుష్పం
సమర్పయామి
ఓం విష్వక్సేన గణపతయే నమః - వకుళ
పుష్పం సమర్పయామి
ఓం ఆమోద గణపతయే నమః - అమృణాళ(తామర
పువ్వు) సమర్పయామి
ఓం ప్రమథ గణపతయే నమః - పాటలీ పుష్పం
సమర్పయామి
ఓం రుద్ర గణపతయే నమః - ద్రోణ పుష్పం
సమర్పయామి
ఓం విద్యా గణపతయే నమః - ధత్తూర
పుష్పం సమర్పయామి
ఓం విఘ్న గణపతయే నమః - చంపక పుష్పం
సమర్పయామి
ఓం దురిత గణపతయే నమః - రసాల పుష్పం
సమర్పయామి
ఓం కామితార్థప్రద గణపతయే నమః -
కేతకీ పుష్పం సమర్పయామి
ఓం సమ్మోహ గణపతయే నమః - మాధవీ
పుష్పం సమర్పయామి
ఓం విష్ణు గణపతయే నమః - శమ్యాక
పుష్పం సమర్పయామి
ఓం ఈశ గణపతయే నమః - అర్క పుష్పం
సమర్పయామి
ఓం గజాస్య గణపతయే నమః - కల్హార
పుష్పం సమర్పయామి
ఓం సర్వసిద్ధి గణపతయే నమః -
సేవంతికా పుష్పం సమర్పయామి
ఓం వీర గణపతయే నమః - బిల్వ పుష్పం
సమర్పయామి
ఓం కందర్ప గణపతయే నమః - కరవీర
పుష్పం సమర్పయామి
ఓం ఉచ్ఛిష్ఠ గణపతయే నమః - కుంద
పుష్పం సమర్పయామి
ఓం బ్రహ్మ గణపతయే నమః - పారిజాత
పుష్పం సమర్పయామి
ఓం జ్ఞాన గణపతయే నమః - జాతీ పుష్పం
సమర్పయామి
ఏకవింశతి దూర్వాయుగ్మ
పూజా (రెండు దళములు కలిసిన గరిక)
ఓం గణాధిపాయ నమః - దూర్వాయుగ్మం
సమర్పయామి
ఓం పాశాంకుశధరాయ నమః - దూర్వాయుగ్మం
సమర్పయామి
ఓం ఆఖువాహనాయ నమః - దూర్వాయుగ్మం
సమర్పయామి
ఓం వినాయకాయ నమః - దూర్వాయుగ్మం
సమర్పయామి
ఓం ఈశపుత్రాయ నమః - దూర్వాయుగ్మం
సమర్పయామి
ఓం సర్వసిద్ధిప్రదాయ నమః -
దూర్వాయుగ్మం సమర్పయామి
ఓం ఏకదంతాయ నమః - దూర్వాయుగ్మం
సమర్పయామి
ఓం ఇభవక్త్రాయ నమః - దూర్వాయుగ్మం
సమర్పయామి
ఓం మూషకవాహనాయ నమః - దూర్వాయుగ్మం
సమర్పయామి
ఓం కుమారగురవే నమః - దూర్వాయుగ్మం
సమర్పయామి
ఓం కపిలవర్ణాయ నమః - దూర్వాయుగ్మం
సమర్పయామి
ఓం బ్రహ్మచారిణే నమః - దూర్వాయుగ్మం
సమర్పయామి
ఓం మోదకహస్తాయ నమః - దూర్వాయుగ్మం
సమర్పయామి
ఓం సురశ్రేష్ఠాయ నమః - దూర్వాయుగ్మం
సమర్పయామి
ఓం గజనాసికాయ నమః - దూర్వాయుగ్మం
సమర్పయామి
ఓం కపిత్థఫలప్రియాయ నమః -
దూర్వాయుగ్మం సమర్పయామి
ఓం గజముఖాయ నమః - దూర్వాయుగ్మం
సమర్పయామి
ఓం సుప్రసన్నాయ నమః - దూర్వాయుగ్మం
సమర్పయామి
ఓం సురాగ్రజాయ నమః - దూర్వాయుగ్మం
సమర్పయామి
ఓం ఉమాపుత్రాయ నమః - దూర్వాయుగ్మం
సమర్పయామి
ఓం స్కందప్రియాయ నమః - దూర్వాయుగ్మం
సమర్పయామి
ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే
నమః నానావిధ పత్ర పుష్పాణి సమర్పయామి
శ్రీవినాయక అష్టోత్తర శతనామావళిః (అష్టోత్తరం చదవండి.)
ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే
నమః అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి
ధూపం: (అగరబత్తి
వెలిగించండి)
దశాంగం గుగ్గులోపేతం సుగంధి
సుమనోహరమ్ |
ఉమాసుత నమస్తుభ్యం గృహాణవరదో భవ ||
ఓం శ్రీ వరసిద్ధివినాయక స్వామినే
నమః ధూపమాఘ్రాపయామి |
దీపం:
సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినా
ద్యోతితం మయా |
గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోఽస్తు
తే ||
ఓం శ్రీ వరసిద్ధివినాయక స్వామినే
నమః దీపం దర్శయామి |
నైవేద్యం:
(కొబ్బరికాయ, ఇతర పళ్ళు, పిండివంటకాలు)
సుగంధాన్ సుకృతాంశ్చైవ మోదకాన్ ఘృత
పాచితాన్ |
నైవేద్యం గృహ్యతాం దేవ చణముద్గైః
ప్రకల్పితాన్ ||
భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోష్యం
పానీయమేవ చ |
ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయక
||
ఓం శ్రీ వరసిద్ధివినాయక స్వామినే
నమః నైవేద్యం సమర్పయామి |
తాంబూలం:
పూగీఫలసమాయుక్తం నాగవల్లీదళైర్యుతమ్
|
కర్పూరచూర్ణసంయుక్తం తాంబూలం
ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీ వరసిద్ధివినాయక స్వామినే
నమః తాంబూలం సమర్పయామి |
తాంబూల చర్వణానంతరం ఆచమనీయం
సమర్పయామి |
నీరాజనం:
ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూరశకలైస్తథా
|
నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ ||
ఓం శ్రీ వరసిద్ధివినాయక స్వామినే
నమః నీరాజనం సమర్పయామి |
నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి |
మంత్రపుష్పం:
గణాధిప నమస్తేఽస్తు ఉమాపుత్రాఘనాశన |
వినాయకేశతనయ సర్వసిద్ధిప్రదాయక ||
ఏకదంతైకవదన తథా మూషకవాహన |
కుమారగురవే తుభ్యమర్పయామి
సుమాంజలిమ్ ||
ఓం శ్రీ వరసిద్ధివినాయక స్వామినే
నమః మంత్రపుష్పం సమర్పయామి |
ప్రదక్షిణం:
ప్రదక్షిణం కరిష్యామి సతతం
మోదకప్రియ |
మద్విఘ్నం హరయే శీఘ్రం
భక్తానామిష్టదాయక ||
ఆఖువాహన దేవేశ విశ్వవ్యాపిన్ వినాయక
|
ప్రదక్షిణం కరోమి త్వాం ప్రసీద వరదో
భవ ||
యానికాని చ పాపాని జన్మాంతరకృతాని చ
|
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే
పదే ||
పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా
పాపసంభవః |
త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల ||
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష
వినాయక ||
ఓం శ్రీ వరసిద్ధివినాయక స్వామినే
నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి |
(ప్రదక్షిణ తరువాత
నమస్కరించి)
సాష్టాంగ నమస్కారం:
నమో నమో గణేశాయ నమస్తే విశ్వరూపిణే |
నిర్విఘ్నం కురు మే కామం నమామి
త్వాం గజాననా ||
అగజానన పద్మార్కం గజానన మహర్నిశమ్ |
అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే ||
నమస్తే భిన్నదంతాయ నమస్తే హరసూనవే |
మమాభీష్టప్రదో భూయో వినాయక నమోఽస్తు
తే ||
ఓం శ్రీ వరసిద్ధివినాయక స్వామినే
నమః సాష్టాంగ నమస్కారం సమర్పయామి |
ప్రార్థన:
ప్రసీద దేవదేవేశ ప్రసీద గణనాయక |
ఈప్సితం మే వరం దేహి పరత్ర చ
పరాంగతిమ్ ||
వినాయక వరం దేహి మహాత్మన్ మోదకప్రియ
|
అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు
సర్వదా ||
ఓం శ్రీ వరసిద్ధివినాయక స్వామినే
నమః ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి
రాజోపచార పూజా:
ఓం శ్రీ వరసిద్ధివినాయక స్వామినే
నమః - ఛత్రమాచ్ఛాదయామి
ఓం శ్రీ వరసిద్ధివినాయక స్వామినే
నమః - చామరైర్వీజయామి
ఓం శ్రీ వరసిద్ధివినాయక స్వామినే
నమః - గీతం శ్రావయామి
ఓం శ్రీ వరసిద్ధివినాయక స్వామినే
నమః - నృత్యం దర్శయామి
ఓం శ్రీ వరసిద్ధివినాయక స్వామినే
నమః - వాద్యం ఘోషయామి
ఓం శ్రీ వరసిద్ధివినాయక స్వామినే
నమః - ఆందోళికాన్ ఆరోహయామి
ఓం శ్రీ వరసిద్ధివినాయక స్వామినే
నమః - అశ్వాన్ ఆరోహయామి
ఓం శ్రీ వరసిద్ధివినాయక స్వామినే
నమః - గజాన్ ఆరోహయామి
ఓం శ్రీ వరసిద్ధివినాయక స్వామినే
నమః - సమస్త రాజోపచారాన్ దేవోపచారాన్ సమర్పయామి
పునరర్ఘ్యం:
అర్ఘ్యం గృహాణ హేరంబ వరప్రద వినాయక |
గంధపుష్పాక్షతైర్యుక్తం భక్త్యా
దత్తం మయా ప్రభో ||
ఓం శ్రీ వరసిద్ధివినాయక స్వామినే
నమః యిదమర్ఘ్యం యిదమర్ఘ్యం యిదమర్ఘ్యమ్
నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాయక
|
పునరర్ఘ్యం ప్రదాస్యామి గృహాణ
గణనాయక ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః
యిదమర్ఘ్యం యిదమర్ఘ్యం యిదమర్ఘ్యమ్
నమస్తే భిన్నదంతాయ నమస్తే హరసూనవే |
యిదమర్ఘ్యం ప్రదాస్యామి గృహాణ గణనాయక
||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః
యిదమర్ఘ్యం యిదమర్ఘ్యం యిదమర్ఘ్యమ్
గౌర్యంగమలసంభూత స్వామి జ్యేష్ఠ
వినాయక |
గణేశ్వర గృహాణార్ఘ్యం గజానన
నమోఽస్తు తే ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః
యిదమర్ఘ్యం యిదమర్ఘ్యం యిదమర్ఘ్యమ్
సమర్పణం:
యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః
పూజా క్రియాదిషు |
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే
గజాననమ్ ||
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం
వినాయక |
యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు
తే ||
క్రింది విధంగా చెబుతూ అక్షతలు, నీటిని
పళ్ళెంలో వదలాలి.
అనయా ధ్యానావహనాది షోడశోపచార పూజయాచ, అస్తోత్తర
నామార్చనయాచ, అవసర, మహానివేదనయాచ
భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణాధిపతి దేవతర్పణమస్తు, శ్రీ
వర సిద్ధి వినాయకః స్వామి సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు |
క్రింది శ్లోకం చెబుతూ పంచామృతాలు, కొబ్బరినీళ్లు
కలిపి త్రీర్థంగా పెద్దలు, పిల్లలు మిగతా కుటుంబ సభ్యులు తీసుకోవాలి.
|| అకాల మృతుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త
పాపక్షయకరం శ్రీ మహాగణపతి పాదోదకం
పావనం శుభం ||
ఉద్యాపన: (నిమజ్జనం)
స్వామివారిని 1, 3, 5, 7, 9,
11, 21 రోజులు నిత్యపూజ
చేసి నిమ్మజ్జనం చేసేవారు ఆరోజు క్రింది మంత్రాన్ని చదువుతూ స్వామివారిని ఈశాన్య
దిశగా కదిలించి ఉద్యాపన చెప్పుకోవాలి.
యజ్ఞేన యజ్ఞ మయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్
తే హనాకం మహిమానః సచంతే యత్ర పూర్వే
సాధ్యాః సంతి దేవాః
అస్మిన్ బింబే ప్రతిష్ఠితం వరసిద్ధి
వినాయకం యథాస్థానముద్వాసయమి
శ్రీ మహాగణాధిపతయే నమః యధాస్థానం
ప్రవేశయామి.. శోభనార్ధం పునరాగమనాయచ.