Vinayaka Dandakam – శ్రీ వినాయక దండకం

Vinayaka Dandakam – శ్రీ వినాయక దండకం

 

శ్రీ పార్వతీపుత్ర లోకత్రయీస్తోత్ర, సత్పణ్యచారిత్ర, భద్రేభవక్త్రా మహాకాయ, కాత్యాయనీ నాధ సంజాతస్వామి శివాసిద్ధి విఘ్నేశ, నీ పాద పద్మంబులన్, నిదుకంటంబు నీబొజ్జ నీమోము నీమౌలి బాలేందు ఖండంబు నీ నాల్గు హస్తంబు నీ కరలంబు నీ పెద్ద వక్త్రంబు నీ పాద హస్తంబు లంబోదరంబున్ సదమూషకాశ్వంబు నీ మందహాసంబు నీచిన్న తొండంబు నీ గుజ్జ రూపంబు నీ సూర్పకర్ణంబు నీ నాగ యజ్ఞోపవీతంబు నీ భవ్యరూపంబు దర్శించి హర్షించి సంప్రీతి మ్రొక్కంగ శ్రీ గంధమున్ గుంకుమంబక్షతాల్ జాజులున్ చంపకంబుల్ తగన్ మల్లెలున్ మోల్లులున్ మంచి చేమంతులున్ దేల్లగాన్నేరులున్ మంకెనలన్ పోన్నలన్ పువ్వులున్ మంచి దూర్వంబులన్ దెచ్చి శాస్త్రోక్తరీతిన్ సమర్పించి పూజించి సాష్టాంగము చేసి విఘ్నేశ్వరా!నీకుటెంకాయ పోన్నంటిపండ్లున్ మఱిన్ మంచివౌ నిక్షుఖండంబులన్ రేగు బండ్లప్పడాల్ వడల్ నేయిబూరెల్ మరిన్ గోదుమప్పంబులున్ వడల్ పునుగులున్ బూరేలున్ గారెలున్ చొక్కమౌ చల్మిడిన్ బెల్లమున్ దేనెయుంజున్ను బాలాజ్యమున్ నానుబియ్యం బుణామ్రంబు బిల్వంబు మేల్ బంగురున్ బల్లెమందుంచి నైవేద్యమంబుంచి నీరాజనంబున్ నమస్కారముల్ చేసి విఘ్నేశ్వరా! నిన్ను బూజింపకే యన్యదైవంబులం బ్రార్ధనల్ సేయుటల్ కాంచనం బోల్లకే యిన్ము దాగోరు చందంబుగాదే మహాదేవ ! యో భక్తమందార ! యో సుందరాకారా ! యో భాగ్యగంభీర ! యోదేవ చూడామణీ లోక రక్షా మణీ ! బందు చింతామణీ ! స్వామీ నిన్నెంచ, నేనంత నీ దాసదాసాది దాసుండ శ్రీ దొంతరాజాన్వ వాయుండ రామాబిధానుండ నన్నిప్డు చేపట్టి సుశ్రేయునించేసి శ్రీమంతుగన్ జూచి హృత్పద్మ సింహాసనారూడతన్ నిల్పి కాపాడుటేకాదు నిను గొలిచి ప్రార్ధించు భక్తాళికిన్ కొంగు బంగారమై కంటికిన్ రెప్పవై బుద్ధియున్ విద్యయున్ పాడియున్ పుత్రపౌత్రాభివృద్ధిన్ దగన్ కల్గగాజేసి పోషించు మంటిన్ గృహన్ గావుమంటిన్ మహాత్మా యివే వందనంబుల్ శ్రీ గణేశా ! నమస్తే నమస్తే నమస్తే నమః ||

 

|| ఇతి శ్రీ వినాయక దండకం సమాప్తం ||