Sri Bramarambika Ashtakam in Telugu – శ్రీ భ్రమరాంబిక అష్టకం
రవి సుధాకర వహ్ని లోచన రత్న కుండల భూషిణి
ప్రవిమలంబుగా మమ్మునేలిన భక్తజన చింతామణి
అవని జనులకు కొంగు బంగారైన దైవ శిఖామణి
శివుని పట్టపురాణి గుణమణి శ్రీగిరి
భ్రమరాంబికా ||1||
కలియుగంబున మానవులను కల్పతరువై యుండవా
వెలయు శ్రీగిరి శిఖరమందున విభవమై
విలసిల్లవా
ఆలసింపక భక్త వరులకు అష్టసంపద లీయావా
జిలుగు కుంకుమ కాంతిరేకుల శ్రీ గిరి
భ్రమరాంబిక ||2||
అంగ వంగ కలింగ కాశ్మీరాంధ్ర దేశములందునన్
పొంగుచును వరహాల కొంకణ భూముల యందునన్
రంగుగా కర్ణాట మగధ మరాఠ దేశములందునన్
శృంఖలా దేశముల వెలసిన శ్రీగిరి భ్రమరాంబిక ||3||
అక్షయంబుగా కాశి లోపల అన్నపూర్ణ భవానివై
సాక్షి గణపతి కన్న తల్లివి సద్గుణావతి
శాంభవి
మోక్ష మొసగెడు కనక దుర్గవు మూలకారణశక్తివి
శిక్షజేతువు ఘోర భవముల శ్రీగిరి భ్రమరాంబిక
||4||
ఉగ్ర లోచన వర వధూమణి యొప్పుగల్గిన భామిని
విగ్రహంబుల కెల్ల ఘనమై వెలయు శోభనాకారిణి
అగ్ర పీఠమునందు వెలసిన ఆగమార్థ విచారిణి
శీఘ్రమేకని వరము లిత్తువు శ్రీగిరి
భ్రమరాంబికా ||5||
నిగమగోచర నీలకుండలి నిర్మలాంగి నిరంజనీ
మిగుల చక్కని పుష్ప కోమలి మీననేత్ర దయానిధీ
జగతిలోన ప్రసిద్ధికెక్కిన చంద్రముఖి
సీమంతినీ
చిగురుటాకులవంటి పెదవుల శ్రీగిరి
భ్రమరాంబికా ||6||
సోమశేఖర పల్లవారధి సుందరీమణీ ధీమణీ
కోమలాంగి కృపాపయోనిధి కుటిలకుంతల యోగినీ
నా మనంబున పాయకుండమ నగకులేశుని నందినీ
సీమలోన ప్రసిద్ధికెక్కిన శ్రీగిరి
భ్రమరాంబికా ||7||
భూతనాథుని వామభాగము పొందుగా చేకొంటివి
ఖ్యాతిగను శ్రీ శైలమున విఖ్యాతిగా
నెలకొంటివి
పాతకంబుల పాఱద్రోలుచు భక్తులను చేకొంటివా
శ్వేతగిరిపై నుండి వెలసిన శ్రీ గిరి
భ్రమారాంబికా ||8||
ఎల్లవెలసిన నీదు భావము విష్ణులోకము నందున
పల్లవించును నీ ప్రభావము బ్రహ్మలోకము నందున
తెల్లముగ కైలాసమందున మూడులోకము లందున
చెల్లునమ్మ త్రిలోకవాసిని శ్రీ గిరి
భ్రమరాంబికా ||9||
తరుణి శ్రీ గిరి మల్లికార్జున దైవరాయల
భామినీ
కరుణతో మమ్మేలు యెప్పుడు కల్ప వృక్షము
భంగినీ
వరుసతో నీ యష్టకంబును వ్రాసి చదివిన వారికి
సిరులనిచ్చెద వేల్ల కాలము శ్రీ గిరి
భ్రమరాంబిక ||10||
|| ఇతి శ్రీ భ్రమరాంబిక అష్టకం సమాప్తం ||