29 May 2025

Sri Shiridi Sai Baba Chalisa - శ్రీ షిరిడి సాయిబాబా చాలీసా


Sri Shiridi Sai Baba Chalisa - శ్రీ షిరిడి సాయిబాబా చాలీసా

 

శిరిడీ వాసా సాయిప్రభో - జగతికి మూలం నీవె ప్రభో

దత్త దిగంబర అవతారం - నీతో సృష్టి వ్యవహారం

త్రిమూర్తి రూపా ఓసాయి - కరుణించి కాపాడోయి

దరిశనమీయగ రావయ్యా - ముక్తికి మార్గం చూపుమయా || శిరిడీ వాసా సాయిప్రభో... ||

 

కఫిని వస్త్రము ధరియించి - భుజముకు జోలి తగిలించి

నింబవృక్షపు ఛాయలలో - ఫకీరు వేషపు ధారణలో

కలియుగమందున వెలసితివి - త్యాగం సహనం నేర్పితివి

శిరిడీ గ్రామం నీవాసం - భక్తుల మదిలో నీరూపం || శిరిడీ వాసా సాయిప్రభో... ||

 

చాంద్‌పాటిలును కలుసుకొని - ఆతని బాధలు తెలుసుకుని

గుఱ్ఱపుజాడ తెలిపితివి - పాటిల్‌ బాధను తీర్చితివి

వెలిగించావు జ్యోతులను - నీవుపయోగించీ జలము

అచ్చెరువొందెను ఆగ్రామం - చూసీ వింతైనా దృశ్యం || శిరిడీ వాసా సాయిప్రభో... ||

 

బాయిజా చేసెను నీసేవా - ప్రతిఫలమిచ్చావో దేవా

నీ ఆయువునూ బదులిచ్చీ - తాత్యానూ నీవు బ్రతికించి

పశుపక్షులనూ ప్రేమించీ - ప్రేమతొ వాటిని లాలించీ

జీవులపైనా మమకారం - చిత్రమయా నీ వ్యవహారం || శిరిడీ వాసా సాయిప్రభో... ||

 

నీ ద్వారములో నిలిచితినీ - నిన్నే నిత్యము కొలిచితినీ

అభయమునిచ్చీ బ్రోవుమయా - ఓ శిరిడీశా దయామయా

ధన్యము ఓ ద్వారకమాయీ - నీలో నిలిచెను శ్రీసాయీ

నీ ధునిమంటల వేడిమికీ - పాపము పోవునుతాకిడికీ || శిరిడీ వాసా సాయిప్రభో... ||

 

ప్రళయ కాలమూ ఆపితివీ - భక్తులనూ నీవు బ్రోచితివీ

చేసి మహమ్మారి నాశనము - కాపాడీ శిరిడీ గ్రామం

అగ్నిహోత్రీ శాస్త్రీకీ - లీలా మహత్యం చూపించీ

శ్యామానూ బ్రతికించితివీ - పామూ విషమూ తొలగించీ || శిరిడీ వాసా సాయిప్రభో... ||

 

భక్తభీమాజీ క్షయరోగం - నశియించే అతనీ సహనం

ఊదీ వైద్యం చేశావూ - వ్యాధిని మాయం చేశావూ

కాకాజీ కి ఓసాయీ - విఠలదర్శనం ఇచ్చితివీ

దామూకిచ్చీ సంతానం - కలిగించితివీ సంతోషం || శిరిడీ వాసా సాయిప్రభో... ||

 

కరుణాసింధూ కరుణించూ - మాపై కరుణా కురిపించూ

సర్వం నీకే అర్పితమూ - పెంచుము భక్తీభావమును

ముస్లిం అనుకొనె నినుమేఘా - తెలుసుకునీ ఆతని బాధా

దాల్చీ శివశంకర రూపం - ఇచ్చావయ్యా దరిశనమూ || శిరిడీ వాసా సాయిప్రభో... ||

 

డాక్టరుకూ నీవు రామునిగా - బల్వంతుకు శ్రీదత్తునిగా

నిమోనుకరుకూ మారుతిగా - చిదంబరుకు శ్రీగణపతిగా

మార్తాండ్‌కు ఖండోబాగా - గణూకు సత్యదేవునిగా

నరసింహస్వామిగ జోషీకి - దరిశనమిచ్చిన శ్రీసాయి || శిరిడీ వాసా సాయిప్రభో... ||

 

రేయీ పగలూ నీధ్యానం - నిత్యం నీలీలా పఠనం

భక్తితో చేయండీ ధ్యానం - లభించునూ ముక్తికి మార్గం

పదకొండూ నీ వచనాలు - బాబా మాకవె వేదాలూ

శరణని వచ్చిన భక్తులను - కరుణించి నీవూ బ్రోచితివీ || శిరిడీ వాసా సాయిప్రభో... ||

 

అందరిలోనా నీ రూపం - నీ మహిమా అతి శక్తిమయం

ఓసాయీ మేము మూఢులమూ - ఒసగుమయా మాకు జ్ఞానమునూ

సృష్టికి నీవేనయ మూలం - సాయీ మేమూ సేవకులం

సాయీ నామము తలచెదమూ - నిత్యము సాయిని కొలిచెదమూ || శిరిడీ వాసా సాయిప్రభో... ||

 

భక్తిభావనా తెలుసుకొనీ - సాయిని మదిలో నిలుపుకొనీ

చిత్తముతో సాయీ ధాన్యం - చేయండీ ప్రతినిత్యం

బాబా కాల్చిన ధునిఊదీ - నివారించునూ అదివ్యాధీ

సమాధినుండీ శ్రీసాయీ - భక్తులనూ కాపాడేనోయి || శిరిడీ వాసా సాయిప్రభో... ||

 

మనప్రశ్నలకు జవాబులూ - తెలుపును సాయీ చరితములూ

వినండి లేక చదవండీ - సాయీ సత్యం చూడండీ

సత్సంగమునూ చేయండీ - బాబా స్వప్నం పొందండీ

భేదభావములు మానండీ - సాయే మన సద్గురువండీ || శిరిడీ వాసా సాయిప్రభో... ||

 

వందనమయ్యా పరమేశా - ఆపద్బాంధవ సాయీశా

మా పాపములూ కడతేర్చూ - మామది కోరిక నెరవేర్చూ

కరుణామూర్తీ ఓసాయీ - కరుణతో మము దరిచేర్చోయీ

మా మనసే నీ మందిరమూ - మా పలుకులే నీకు నైవేద్యం || శిరిడీ వాసా సాయిప్రభో... ||

 

|| అఖిలాండకోటి బ్రహ్మాండనాయక శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహారాజ్ కీ జై ||